SNP
Rohit Sharma, MI, IPL 2024: ఇప్పటికే వరుస ఓటములతో టోర్నీ నుంచి ఇంటి బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో షాకింగ్ న్యూస్ అందుతోంది. రోహిత్ శర్మ మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rohit Sharma, MI, IPL 2024: ఇప్పటికే వరుస ఓటములతో టోర్నీ నుంచి ఇంటి బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో షాకింగ్ న్యూస్ అందుతోంది. రోహిత్ శర్మ మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
ఐపీఎల్ 2024లో చెత్త ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురుదెబ్బ తలిగే ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్న సమాచారం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌లు ఆడేసింది. ఈ 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో.. ఎలాగో ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. మొత్తం 12 పాయింట్లే ఉంటాయి. సో.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. ఇంత బ్యాడ్ పోజిషన్‌లో ఉన్న ముంబై ఇండియన్స్.. కనీసం పరువు కోసం ఆడాలన్నా.. రోహిత్ శర్మ లేకుండా బరిలోకి దిగే పరిస్థితి వచ్చింది.
ఇంతకీ రోహిత్ శర్మ ఎందుకు మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు అంటే.. కేకేఆర్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం ఇంప్యాక్ట్ ప్లేయర్‌గానే ఆడాడు. కేకేఆర్‌తో మ్యాచ్ కంటే ముందే రోహిత్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఆ జట్టు సభ్యుడు పియూష్ చావ్లా వెల్లడించాడు. అందుకే రోహిత్ శర్మ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. అయితే.. వెన్నునొప్పి తగ్గినా కూడా రాబోయే మ్యాచ్‌లు ఆడకుండా.. రెస్ట్ తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం.
అందుకు కారణం ఏంటంటే.. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ కోసం ఇటీవల భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సారి ఎలాగైన వరల్డ్ కప్ గెలవాలని టీమిండియా కసితో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెన్నునొప్పితో ఐపీఎల్‌లో పెద్దగా ఉపయోగం లేని మ్యాచ్‌లు ఆడి.. గాయాన్ని పెద్దగా చేసుకోవడం ఇష్టం లేని రోహిత్ శర్మ పూర్తిగా రెస్ట్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వాలని రోహిత్ నిర్ణయం తీసుకుంటే.. దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chawla said “Rohit Sharma just had a mild back-stiffness so it was a just precautionary thing”.
[Rohit as an impact player] pic.twitter.com/XFr0HazLiY
— Johns. (@CricCrazyJohns) May 4, 2024