iDreamPost
android-app
ios-app

వీడియో: రోహిత్‌ మిస్‌ చేసినా.. కోహ్లీ పూర్తి చేసి కెప్టెన్‌ను నవ్వించాడు!

  • Published Aug 05, 2024 | 11:44 AM Updated Updated Aug 05, 2024 | 11:44 AM

Rohit Sharma, Virat Kohli, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కలిసి చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Virat Kohli, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కలిసి చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 05, 2024 | 11:44 AMUpdated Aug 05, 2024 | 11:44 AM
వీడియో: రోహిత్‌ మిస్‌ చేసినా.. కోహ్లీ పూర్తి చేసి కెప్టెన్‌ను నవ్వించాడు!

కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేవలం 241 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక రోహిత్‌ సేన పరాజయం చవిచూసింది. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటనలు మాత్రం.. భారత క్రికెట్‌ అభిమానులను ఎంతో సంతోషపెట్టాయి. అందులో ఒకటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కలిసి చేసిన ఒక రనౌట్‌. శ్రీలంక ఇన్నింగ్స్‌ చివరి బాల్‌కు చోటు చేసుకున్న ఈ రనౌట్‌ రోకో(రోహిత్‌-కోహ్లీ) ఫ్యాన్స్‌కు కనుల పండువగా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. లంకను ఆరంభంలోనే మొహమ్మద్‌ సిరాజ్‌ దెబ్బతీసినా.. ఆ తర్వాత కోలుకున్న లంకేయులు.. టీమిండియా ముందు మంచి ఫైటింగ్‌ టార్గెట్‌ సెట్‌ చేశారు. అయితే.. ఇన్నింగ్స్‌ చివరి బాల్‌కు జెఫ్రీ వాండర్సే మిడ్‌ ఆఫ్‌ వైపు ఆడాడు. తొలి రన్‌ పూర్తి చేసే క్రమంలో.. రోహిత్‌ శర్మ బాల్‌ అందుకుని నాన్‌స్ట్రైకర్‌ వైపు త్రో కొట్టాడు. అది కొద్దిలో మిస్‌ అయింది. దాంతో ధనంజయా రెండో రన్‌ కోసం ప్రయత్నించాడు. ఈ లోపు రోహిత్‌ త్రోకు బ్యాక్‌అప్‌గా వచ్చిన కోహ్లీ.. బాల్‌ అందుకుని నేరుగా స్టైకింగ్‌ వైపు దూసుకెళ్లి స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇలా వాండర్సేను రనౌట్‌ చేద్దాం అనుకుని రోహిత్‌ మిస్‌ అయినా.. కోహ్లీ ధనంజయాను రనౌట్‌ చేసి.. రోహిత్‌ అనుకున్నది చేశాడు. కోహ్లీ చేసిన పనితో రోహిత్‌ శర్మ నవ్వులతో అభినందించాడు. ఈ సీన్స్‌ ఇద్దరి ఫ్యాన్స్‌ను సంతోషపర్చింది.

బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. రోహిత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌ మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్‌ శర్మ 64, అక్షర్‌ పటేల్‌ 44 రన్స్‌తో రాణించారు. ఛేజ్‌ మాస్టర్‌గా పేరున్న కోహ్లీ సైతం కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. శివమ్‌ దూబే, కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌ అయ్యారు. శ్రేయస్‌ అయ్యర్‌ 7 పరుగులు మాత్రమే చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇలా చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. రోహిత్‌-కోహ్లీ చేసిన రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.