SNP
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నేటితో 37 ఏళ్లు నిండాయి.. 38వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నేటితో 37 ఏళ్లు నిండాయి.. 38వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఓపెనర్‌గా తన మార్క్‌ను చూపించి, విరాట్ కోహ్లీ తర్వాత ఇండియన్ క్రికెట్‌కు పెద్ద దిక్కయ్యాడు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌కు అతనే బాస్. అలాగే ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన లీడర్. అలాగే ఆటగాడిగా రోహిత్ శర్మ ఖాతాలో ఆరు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. టీమిండియాను రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిపాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టును అద్భుతంగా నడిపించి.. ఏకంగా ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా నడిపించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 264 పరుగులు బాదిన బ్యాటింగ్ బీస్ట్ రోహిత్ శర్మ. ఇవన్నీ.. కాకుండా.. తాజాగా అతను దేశానికి రెండో టీ20 వరల్డ్‌కప్ అందించిన టీమిండియా కెప్టెన్. ఇక్కడి వరకు క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయాలే.. కానీ, పేదరికం కారణంగా రోహిత్ శర్మ తన కన్నవారికి చిన్నతనంలోనే దూరం అయ్యాడనే విషయం మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు. అలాంటి పరిస్థితి నుంచి టీమిండియా కెప్టెన్‌గా, క్రికెట్ ఐకాన్‌గా, కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగాడు. అతని జర్నీ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి. ఈ రోజు(ఏప్రిల్ 30) రోహిత్ శర్మ పుట్టిన రోజు సందర్భంగా అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం..
రోహిత శర్మ.. మహారాష్ట్రలోని బంసొద్‌లో 1987 ఏప్రిల్ 30న జన్మించాడు. తల్లి పూర్ణిమా శర్మది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం. రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్‌లో కేర్ టేకర్‌గా పనిచేసేవాడు. రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ ఆదాయం తక్కువగా ఉండటం వల్ల రోహిత్ శర్మ.. చిన్నతనంలోనే కన్నవారికి దూరంగా తన తాత వద్ద ఉండాల్సి వచ్చింది. ఎప్పుడైనా అమ్మనాన్నలను చూడాలనిపిస్తే.. డోమ్బివిలికి వెళ్లేవాడు. రోహిత్ శర్మ తల్లిదండ్రులు ఒక చిన్న గదిలో నివాసం ఉండే వారు. రోహిత్ శర్మకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విశాల్ శర్మ. అయితే.. చిన్నతనం నుంచి రోహిత్‌కు క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. రోహిత్‌లోని తపనను గుర్తించిన అతని మేనమామ 1999లో ఒక క్రికెట్ క్యాంపులో చేర్పించాడు.
ఆ క్యాంప్ టీమ్, వివేకానంద స్కూల్‌తో ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ రోహిత్ శర్మ జీవితాన్ని మలుపు తిప్పింది. 12 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ.. వివేకనంద టీమ్‌తో ఆడిన ఆటకు ఆ స్కూల్ కోచ్ రమేష్ లాడ్ ఫిదా అయిపోయారు. వెంటనే రోహిత్ శర్మ వివేకనందా స్కూల్‌లో జాయిన్ అవ్వమని కోరారు. కానీ, అంత పెద్ద స్కూల్‌లో చదివేంత ఆర్థిక స్థోమత తనకు లేదని రోహిత్ కోచ్‌కు చెప్పడం, వివేకనంద స్కూల్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి, రోహిత్ శర్మను ఉచితంగా స్కూల్‌లో చేర్చుకోవడంతో పాటు అతనికి 275 రుపాయాల స్కాలర్‌షిప్ కూడా ఇచ్చేందుకు ఒప్పించాడు. దీంతో రోహిత్‌కు వివేకానంద స్కూల్‌లో అడ్మిషన్‌తో పాటు నాలుగేళ్ల పాటు ఉచిత చదువు, క్రికెట్ కోచింగ్ దక్కింది. ఇక్కడి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో రోహిత్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో ధనాధన్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కానీ, రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో టీమ్ స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతనికి 2013లో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది. స్టార్టింగ్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా మారిన తర్వాత అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు 59 టెస్టులు, 262 వన్డేలు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4137 పరుగులు, వన్డేల్లో 10,709, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో కూడా 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్, టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ పేరిటి అద్భుతమైన రికార్డుల ఉన్నాయి. మరి ఎన్నో కష్టాలు దాటి, పేదరికాన్ని జయించి, ఈ రోజు ఇండియన్ క్రికెట్‌కు బాస్‌గా మారిన రోహిత్ శర్మ లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Happy Birthday Anna @ImRo45 🦁🔥#RohitSharma𓃵 #HappyBirthdayRohitSharma pic.twitter.com/RX1xUmPh0e
— MeghanadhPSPK45ᴼᴳ 🦅 (@iammeghanadh45) April 30, 2024