iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో: కప్పు కొట్టిన తర్వాత.. ఆ ప్లేయర్‌ను ముద్దుపెట్టుకున్న రోహిత్‌ శర్మ!

  • Published Jun 30, 2024 | 7:54 AM Updated Updated Jun 30, 2024 | 7:54 AM

టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ అవతరించింది. 13 ఏళ్ల వరల్డ్ కప్ కల నెరవేరిన వేళ ప్లేయర్లు గ్రౌండ్ లో భావోద్వేగానికి గురైయ్యారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆటగాడిని ముద్దుపెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ అవతరించింది. 13 ఏళ్ల వరల్డ్ కప్ కల నెరవేరిన వేళ ప్లేయర్లు గ్రౌండ్ లో భావోద్వేగానికి గురైయ్యారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆటగాడిని ముద్దుపెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rohit Sharma: వీడియో: కప్పు కొట్టిన తర్వాత.. ఆ ప్లేయర్‌ను ముద్దుపెట్టుకున్న రోహిత్‌ శర్మ!

జూన్ 29, 2024.. టీమిండియా క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను టీమిండియా సగర్వంగా సొంతం చేసుకుంది. దాంతో 140 కోట్ల మంది భారతీయులు ఉప్పొంగిపోతున్నారు. 13 సంవత్సరాలుగా ఆకలిగొన్న పులిలా వేచిచూస్తున్న టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుని తన ఆకలిని తీర్చుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. దాంతో గ్రౌండ్ లోనే ఆటగాళ్లు భావోద్వేగాలకు గురైయ్యారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ప్లేయర్ ను ముద్దుపెట్టుకున్న స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ఎందుకంత ప్రత్యేకం? రోహిత్ ముద్దు పెట్టుకుంది ఎవరిని? ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ అవతరించింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫుల్ స్వింగ్ లో ఉన్న టీమిండియా అదే జోరుతో ఫైనల్లో సౌతాఫ్రికాకు షాకిచ్చింది. మెగాటోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసి.. 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది టీమిండియా. చివరిగా 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు ప్రపంచ కప్ ను ఎత్తలేదు. దశాబ్దకాలానికి పైగా నిరీక్షణ తర్వాత 140 కోట్ల మంది ఇండియన్స్ కలను నెరవేర్చింది. ఫైనల్లో విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లోనే కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? గెలుపు తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతున్నాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలో రోహిత్ శర్మ వచ్చి ఆప్యాయతపూర్వకంగా పాండ్యాను ముద్దు పెట్టుకున్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్ లో రోహిత్ ను కాదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ పగ్గాలను హార్దిక్ కు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ.. ఈ ఒక్క ముద్దుతో సమాధానం ఇచ్చారు ఇద్దరు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ(76), అక్షర్ పటేల్(47), శివమ్ దూబే(27) పరుగులతో రాణించారు. ఆ తర్వాత 177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లు ఆడి.. 8 వికెట్లు కోల్పోయి 169 రన్స్ చేసి.. 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. హెండ్రిచ్ క్లాసెన్ 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు కూల్చారు. మరి ఇప్పటి వరకు తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు ఒక్క ముద్దుతో సమాధానం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBettilt girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel