కెప్టెన్సీ, ఓపెనింగ్‌తో పాటు రోహిత్‌కు కొత్త రోల్‌! టీ20 వరల్డ్‌ కప్‌లో మ్యానేజ్‌ చేయగలడా?

Rohit Sharma, T20 World Cup 2024: ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌గా, ఓపెనింగ్‌ బ్యాటర్‌గా బాధ్యతలు మోస్తున్న రోహిత్‌ శర్మ భుజాలపై మరో భారం పడే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, T20 World Cup 2024: ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌గా, ఓపెనింగ్‌ బ్యాటర్‌గా బాధ్యతలు మోస్తున్న రోహిత్‌ శర్మ భుజాలపై మరో భారం పడే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఇటీవల భాతర సెలెక్టర్లు టీమ్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా.. హార్ధిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా మొత్తం 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించారు. మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను జస్ట్‌ ఒక్క మ్యాచ్‌తో చేజార్చుకున్న టీమిండియా.. ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా.. కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉంది. దాని కోసం రోహిత్‌ శర్మ ఒక పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ టీమ్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌గా, ఓపెనర్‌ బ్యాటర్‌గా రోహిత్‌ శర్మపై చాలా పెద్ద పెద్ద బాధ్యతలే ఉన్నాయి. కెప్టెన్‌గా ఎంత తలనొప్పి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్సీ భారంతో చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు తమ ఫామ్‌ను కోల్పోయి, కెరీర్‌ను ముగించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. పైగా ఒక భారీ ఫాలోయింగ్‌ ఉన్న టీమ్‌కు, ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్సీ చేయడం అంటే మాటలు కాదు. కొన్ని వందల టన్నుల బరువు మోస్తున్నంత ప్రెజర్‌ ఉంటుంది. అలాగే ఓపెనర్‌గా కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కొవాలి. టీమ్‌కు మంచి స్కోర్‌ అందించాలంటే.. ముందు ఓపెనర్లు మంచి స్టార్ట్‌ అందివ్వాలి. పిచ్‌పై బాల్‌ ఎలా పడుతుందో ఏమో తెలియకుండా.. ప్రత్యర్థి టీమ్‌ బెస్ట్‌ బౌలర్‌ను కొత్త బంతితో ఎదుర్కొని.. పరుగులు సాధించాలి.

టెస్టులు, వన్డేల్లో కాస్త టీమ్‌ అయినా తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. కానీ, టీ20ల్లో అంత అవకాశం ఉండదు. తొలి బంతి నుంచే హిట్టింగ్‌ చేయాలి. ఇలా టీమిండియా కెప్టెన్‌గా, ఓపెనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌ కప్‌లో అవసరం అయితే.. స్పిన్నర్‌ రూపంలో ఒక ఆల్‌రౌండర్‌గా కూడా మారే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించిన టీమ్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ లేడు కదా అని ఎదురైన ప్రశ్నకు నేను ఉన్నాను కదా అని రోహిత్‌ మీడియా సమావేశంలో చెప్పాడు. వెస్టిండీస్‌ పిచ్‌లు కాస్త స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కనుక.. రోహిత్‌ ఒకటి రెండు ఓవర్లు వేసినా వేయొచ్చు. కెరీర్‌ స్టార్టింగ్‌లో రోహిత్‌ బౌలింగ్ చేసే వాడనే విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మకు హ్యాట్రిక్‌ సాధించిన రికార్డు కూడా ఉంది. మరి టీ20 వరల్డ్‌ కప్‌లో ఆల్‌రౌండర్‌గా మారి రోహిత్‌ బౌలింగ్‌ వేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments