iDreamPost

శ్రీలంకపై విజయం.. రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌! అతను దమ్మున్నోడంటూ..

  • Published Nov 03, 2023 | 1:04 PMUpdated Nov 03, 2023 | 1:04 PM

లంకపై టీమిండియా భారీ విజయం నమోదు చేసింది. ఈ వరల్డ్‌లో అత్యంత భారీ స్కోర్‌ చేసిన టీమిండియా.. ప్రత్యర్థిని మాత్రం అత్యంత దారుణంగా అత్యంత తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ ఆటగాడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లంకపై టీమిండియా భారీ విజయం నమోదు చేసింది. ఈ వరల్డ్‌లో అత్యంత భారీ స్కోర్‌ చేసిన టీమిండియా.. ప్రత్యర్థిని మాత్రం అత్యంత దారుణంగా అత్యంత తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ ఆటగాడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Nov 03, 2023 | 1:04 PMUpdated Nov 03, 2023 | 1:04 PM
శ్రీలంకపై విజయం.. రోహిత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌! అతను దమ్మున్నోడంటూ..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టీమిండియా విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించిన టీమిండియా సగర్వంగా వరల్డ్‌ కప్‌లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన రికార్డు విజయం అందుకుంది. ఏకంగా 302 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 357 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అవుటైనా.. కోహ్లీ-గిల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు భారీ స్కోర్‌ అందించారు. చివర్లో శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే.. ఈ ముగ్గురు కూడా సెంచరీలు పూర్తి చేసుకోలేకపోవడం అభిమానులను నిరాశపర్చింది.

కాగా, మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి పిచ్‌పైనైనా 350 ప్లస్‌ స్కోర్‌ చాలా మంది స్కోర్‌ అని అన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని, సిరాజ్‌ అద్భుతమైన క్వాలిటీ బౌలర్‌ అని పిచ్‌ నుంచి స్వింగ్‌ లభిస్తే, సిరాజ్‌ చెలరేగిపోతాడని, అతను చెలరేగితే మ్యాచ్‌ వన్‌సైడ్‌ అయిపోతుందని అన్నాడు. అందుకే సిరాజ్‌ను బ్యాక్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక షమీ, బుమ్రా అయితే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ గురించి మాట్లాడాడు. అయ్యర్‌ మాసికంగా చాలా బలమైన ఆటగాడు. అతని టాలెంట్‌ ఏంటో మాకు బాగా తెలుసు. మంచి దమ్మున్న ఆటగాడు. అతను ఆడితే ఎలా ఉంటుందో చూశాం అని అన్నాడు రోహిత్‌.

అయితే.. ఈ మ్యాచ్‌ కంటే ముందు సిరాజ్‌, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. టీమిండియా వీళ్లు ముగ్గురే సరైన ప్రదర్శన కనబర్చడం లేదని చాలా మంది విమర్శించారు. అయితే.. లంకతో మ్యాచ్‌లో ఆ లోటు కూడా తీరిపోయిందనే చెప్పాలి. సిరాజ్‌ తన మునుపటి అగ్రెసివ్‌నెస్‌ను చూపిస్తూ.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక గిల్‌ అద్భుతంగా ఆడి 92 పరుగులు చేశాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. కోహ్లీతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తీరు అమోఘం. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కోహ్లీ-గిల్‌ సెట్‌ చేసిన పునాదిపై భారీ స్కోర్‌ అనే బిల్డింగ్‌ కట్టేశాడు. మెరుగు ఇన్నింగ్స్‌ ఆడి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ విజయంతో టీమిండియాలోని ప్రతి ఆటగాడు కూడా సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇదే ఆట కొనసాగిస్తే.. టీమిండియ విశ్వవిజేతగా నిలుస్తుంది. మరి రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి