ఆ రోజు నా గుండె ముక్కలైంది! అప్పటి నుంచి పెద్దగా ఆలోచించడం లేదు: రోహిత్‌ శర్మ

Rohit Sharma, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయిపోయింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు క్రికెట్‌ స్టేడియంలో పసికూన ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది రోహిత్‌ సేన. ఐర్లాండ్‌తోనే కదా అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు లైట్‌ తీసుకోవచ్చు.. కానీ, టీ20 క్రికెట్‌లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. గత టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో చిన్న జట్లు పెద్ద టీమ్స్‌కు ఎలాంటి షాకులు ఇచ్చాయో, అలాగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కూడా పసికూన టీమ్స్‌ పెద్ద టీమ్స్‌ను ఎలా ఓడించాయో చూశాం. ఈ విషయం రోహిత్‌కు బాగా తెలుసు. అందుకే ఐర్లాండ్‌ను రోహిత్‌ లైట్‌ తీసుకోడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లక్షణం రోహిత్‌ది.

అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడంపై రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌ కప్‌ గురించి ఎక్కువగా ఆలోచించి.. లేని ఒత్తిడిని తమపై పెంచుకోవాలని అనుకోవడం లేదని అన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 హార్ట్‌బ్రేక్‌ తర్వాత ఎక్కువ ఆలోచించడం మానేసినట్లు పేర్కొన్నాడు. రేపు ఏం చేయాలనే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని.. ప్రస్తుతానికి ఇదే మా ప్లాన్‌ అన్నట్లు రోహిత్‌ ప్రకటించాడు. అయితే.. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఎలా ఆడాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉందని, గేమ్‌ కోసం బరిలోకి దిగిన తర్వాత తమ బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని, అంతకంటే ఎక్కువ ఆలోచించడం అంటూ రోహిత్‌ వెల్లడించాడు.

2013 నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత.. మూడు వన్డే వరల్డ్‌ కప్‌లు, నాలుగు టీ20 వరల్డ్‌ కప్‌లు, రెండు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌లు జరిగాయి.. ఇందులో ఏ ఒక్క టోర్నీలో కూడా ఇండియా విజేతగా నిలవలేదు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్‌ వరకు వెళ్లినా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై.. మూడో వరల్డ్‌ కప్‌ ఆశలను అడియాశలు చేసుకుంది. అయితే.. ఆ బాధ నుంచి బయటపడిన టీమిండియా క్రికెటర్లు.. ఈ పొట్టి ప్రపంచ కప్‌ను గెలిచి తీరాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రోహిత్‌ శర్మ.. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ ప్లాన్‌ చేసుకుంటూ.. కప్పు కొట్టాలని వేసిన కొత్త ప్రణాళికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments