ఆసియా కప్ లో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతూనే ఉంది. నిన్న పాక్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ 4 బ్యాటర్లు తమ బ్యాట్ కు పనిచెప్పడంతో.. టీమిండియా 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దాంతో ఈ మ్యాచ్ లో 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఇదే ఊపును తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా కొనసాగిస్తున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. లంక బౌలర్లను వణికిస్తూ.. అర్దశతకం పూర్తి చేసుకున్నాడు ఇండియన్ కెప్టెన్. ఈ క్రమంలోనే లంక బౌలర్ షణక వేసిన 10వ ఓవర్లో విధ్వంసం సృష్టించాడు రోహిత్.
ఆసియా కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. నిన్న పాక్ తో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయిన ఇండియా బ్యాటర్లు.. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లోకూడా అదే జోరును చూపెడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. లంక బౌలర్లను వణికిస్తూ.. వరుసగా ఫోర్లతో రెచ్చిపోతున్నాడు. ఇక లంక సారథి వేసిన 10వ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు రోహిత్. లంక సారథిని టార్గెట్ చేసుకుని ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో మరో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.
కాగా..48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 56 పరుగులు చేసి దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అయితే మెుదటి నుంచి అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించ లేదు. పాక్ తో మ్యాచ్ లో అర్ధశతకంతో మెరిసిన గిల్(19) పరుగులకే వెనుదిరగగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో కింగ్ విరాట్ కోహ్లీ(3) తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. మరి లంక సారథి బౌలింగ్ ను టార్గెట్ చేసుకుని ఫోర్లతో విరుచుకుపడిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma dominating the Sri Lankan captain.
4 fours in an over against Shanaka! pic.twitter.com/x3tsnBIe1i
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2023