iDreamPost
android-app
ios-app

రోహిత్‌ ముందు అద్భుత అవకాశం! ధోని కంటే గొప్ప కెప్టెన్‌ అవ్వాలంటే..

  • Published Aug 26, 2023 | 1:24 PM Updated Updated Aug 26, 2023 | 1:24 PM
  • Published Aug 26, 2023 | 1:24 PMUpdated Aug 26, 2023 | 1:24 PM
రోహిత్‌ ముందు అద్భుత అవకాశం! ధోని కంటే గొప్ప కెప్టెన్‌ అవ్వాలంటే..

ప్రస్తుతం టీమిండియా ఫోకస్‌ మొత్తం ఆసియా కప్‌పైనే ఉంది. మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్‌ 2023 ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆ వెంటనే అక్టోబర్‌ 5 నుంచి ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ 2023 భారత్‌ వేదికగా ప్రారంభం అవుతుంది. దీంతో ఈ రెండు మూడు నెలలు క్రికెట్‌ అభిమానులకు పండగే. అయితే.. ఈ ఆసియా కప్‌ టోర్నీతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అరుదైన రికార్డు ఒకటి ఊరిస్తోంది. ఆ రికార్డు గనుక రోహిత్‌ శర్మ సాధిస్తే.. ఆసియా కప్‌ చరిత్రలో టీమిండియా తరఫున గొప్ప కెప్టెన్‌గా నిలుస్తాడు.

ఇప్పటి వరకు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఆసియా కప్‌లో టీమిండియా బెస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. గతంలో ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లోనే జరిగేదన్న విషయం అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్న ఏడాదిలో ఆసియా కప్‌ కూడా జరిగితే.. అప్పుడు ఆసియా కప్‌ను సైతం టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. 2022లో అలాగే టీ20 ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌ నిర్వహించారు. అయితే.. ఈ సారి మళ్లీ వన్డే ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌ నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఆసియా కప్‌ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరిగిన సమయంలో టీమిండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌ ధోని ఉన్నాడు. వన్డే ఫార్మాట్‌లో ధోని కెప్టెన్సీగా టీమిండియా 14 మ్యాచ్‌లు ఆడితే 9 విజయాలు సాధించింది. రోహిత్‌ కెప్టెన్సీలో 2018లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలిచింది.

ఇప్పుడు మళ్లీ వన్డే ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌ జరుగుతుండటంతో మరో ఐదు విజయాలు రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా గెలిస్తే.. ధోని అత్యధిక విజయాల రికార్డునే కాకుండా.. ఆసియా కప్‌ చరిత్రలోనే అత్యధిక విజయాలు సాధించిన(వన్డే ఫార్మాట్‌లో) కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో శ్రీలంక దిగ్గజ మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగా 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ధోని 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో నిలిచాడు. ఇక వరుసగా మిస్బా ఉల్‌ హక్‌ 10 మ్యాచ్‌ల్లో 7, మొయిన్‌ ఖాన్‌ 6 మ్యాచ్‌ల్లో 6, మహేలా జయవర్దనే 10 మ్యాచ్‌ల్లో 6, ఏంజిలో మ్యాథ్యూస్‌ 7 మ్యాచ్‌ల్లో 5, రోహిత్‌ శర్మ 5 మ్యాచ్‌ల్లో 5, మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో వరుసగా ఉన్నారు. మరి ఈ ఆసియా కప్‌తో ధోని రికార్డును రోహిత్‌ శర్మ బ్రేక్‌ చేస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. భారత్‌దే ఆసియా కప్‌! కానీ, వరల్డ్‌ కప్‌..: మాజీ సెలెక్టర్‌