iDreamPost
android-app
ios-app

IND vs PAK: పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగే కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ అందింది. దాంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగే కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ అందింది. దాంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs PAK: పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్!

టీ20 వరల్డ్ కప్ లోకి టైటిల్ ఫేవరెట్ గా దిగిన టీమిండియా.. తన వేటను విజయంతో మెుదలుపెట్టిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లోనే పసికూన ఐర్లాండ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసి టోర్నీపై తన ఉద్దేశాన్ని చాటుకుని.. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత మెగాటోర్నీలో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది టీమిండియా. జూన్ 9న తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు భారీ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మరో రసవత్తరపోరు కోసం సిద్ధమవుతోంది. ప్రపంచం మెుత్తం ఎదురుచూసే మ్యాచ్ జూన్ 9న జరగబోతోంది. దాయాది దేశాలు అయిన ఇండియా-పాక్ మధ్య జరగబోయే ఈ హై ఓల్టేజ్ ఫైట్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు. అలాంటి మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ గుడ్ న్యూస్ అందింది. అసలు విషయం ఏంటంటే?

వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. అయితే రోహిత్ ఫామ్ లోకి వచ్చాడు అని సంతోషించే లోపలే అతడి చేతికి గాయం అయ్యిందన్న విషయం తెలిసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మార్క్ అడైర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ రోహిత్ చేతికి తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడాడు హిట్ మ్యాన్. ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ.. నొప్పి తగ్గకపోవడంతో కెప్టెన్ గ్రౌండ్ ను వీడాల్సి వచ్చింది. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు.

తాజాగా ఈ గాయంపై అప్డేట్ ఇచ్చారు బీసీసీఐ అధికారి ఒకరు. రోహిత్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ఆ అధికారి తెలిపాడు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. దాంతో టీమిండియా ఫ్యాన్స్ మనసు కాస్త కుదుటపడింది. ఫామ్ లోకి వచ్చిన రోహిత్ గాయం కారణంగా టీమ్ కు దూరమైతే.. టీమిండియాకు భారీ షాక్ అనే చెప్పాలి. రోహిత్ కు అయిన గాయం పెద్దది కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి