SNP
Rohit Sharma, MI, Piyush Chawla, IPL 2024: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైనట్లు ఆ జట్టు సభ్యుడు ప్రకటించాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rohit Sharma, MI, Piyush Chawla, IPL 2024: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైనట్లు ఆ జట్టు సభ్యుడు ప్రకటించాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మకు గాయమైనట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రోహిత్ వర్మ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు చేసి నిరాశపర్చాడు. అయితే.. మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి వచ్చి ఇబ్బంది పడుతూనే ఆడాడు. స్వల్ప వెన్నునొప్పితో రోహిత్ శర్మ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు పియూష్ చావ్లా కూడా ధృవీకరించాడు. రోహిత్ శర్మ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు చావ్లా వెల్లడించాడు. అయితే.. ఈ గాయం పెద్దది అయి.. రోహిత్ శర్మ రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024కు దూరం అవుతాడా? అని 100 కోట్ల మందికి పైగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
కోల్‌కత్తాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడించడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ, అసలు విషయం మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసిందే. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం వెనుక అసలు కారణం ఇదే అంటూ తెలిసిందే. రోహిత్ వెన్నుముక నొప్పితో ఇబ్బంది పడుతుండటంతోనే అతన్ని ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడించినట్లు సమాచారం. అయితే.. టీమ్ విజయానికి ఓపెనింగ్ జోడీ ముఖ్యం కావడంతో తప్పని పరిస్థితుల్లో రోహిత్ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చిందని ముంబై టీమ్‌లోని సపోర్ట్ స్టాఫ్ చెప్పుకొస్తున్నారు.
కాగా.. ఇటీవల భారత సెలెక్టర్లు జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఓ 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. 15 మందితో కూడిన స్క్వౌడ్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బై కూడా ఎంపిక చేశారు. అయితే.. ఇప్పుడు వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే.. ఆ మ్యాచ్‌లో గాయం పెద్దది అయితే.. టీ20 వరల్డ్‌కప్‌కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. రోహిత్ లేకపోతే.. వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chawla said “Rohit Sharma just had a mild back-stiffness so it was a just precautionary thing”.
[Rohit as an impact player] pic.twitter.com/XFr0HazLiY
— Johns. (@CricCrazyJohns) May 4, 2024