SNP
Rohit Sharma, T20 World Cup 2024, Rahul Dravid, Jay Shah, Ajit Agarkar: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2024 విజయం వెనుక ఉన్న కనిపించని మూడు సింహాల గురించి వెల్లడించాడు. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma, T20 World Cup 2024, Rahul Dravid, Jay Shah, Ajit Agarkar: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2024 విజయం వెనుక ఉన్న కనిపించని మూడు సింహాల గురించి వెల్లడించాడు. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
దాదాపు 17 ఏళ్ల తర్వాత.. టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ 2024లో అద్భుత ప్రదర్శనతో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. కప్పు కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ విక్టరీతో.. 2023లో వన్డే వరల్డ్ కప్ ఓడిన బాధ నుంచి టీమిండియా బయటపడింది. అంతకంటే ముందు.. భారత ఆటగాళ్లను, అభిమానులను వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి వేధించింది. ఆ బాధను భరిస్తూనే.. రోహిత్ సేన ఛాంపియన్‌గా అయ్యింది.
అయితే.. టీ20 వరల్డ్ కప్ విజయానికి వెనుక ఓ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని.. ఆ ‘త్రీ పిల్లర్స్’ కారణంగానే.. టీమిండియా కప్పు సాధించిందంటూ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ముంబైలో జరిగిన.. సియట్ క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడానికి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెక్రటరీ జైషా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కారణం అంటూ ప్రకటించాడు.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత.. టీమ్‌ను మళ్లీ నార్మల్ చేయడానికి ఈ ముగ్గురు ఎంతో కష్టపడ్డారని, ఆ బాధ నుంచి బయటపడేయడానికి వాళ్లు పడిన కష్టం.. టీ20 వరల్డ్ కప్ 2024 వచ్చేలా చేసిందంటూ రోహిత్ పేర్కొన్నాడు. అయితే.. ఈ టోర్నీ ఆసాంతం రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్‌తో టీమిండియాకు కప్పు దక్కింది. టోర్నీ మొత్తం విఫలమైన కోహ్లీ.. ఫైనల్లో మాత్రం అదరగొట్టాడు. మొత్తంగా 2007 తర్వాత.. రెండోసారి టీమిండియ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. మరి ఈ క్రెడిట్‌ను రోహిత్ శర్మ.. ద్రవిడ్, జైషా, అగార్కర్‌కు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “I got a lot of help from my 3 pillars, Mr Jay Shah, Mr Rahul Dravid & chairman of selectors Ajit Agarkar. That was very critical for me to do what I did & not to forget the players, who came in at different points in time – helped the team to achieve what we… pic.twitter.com/oVCYr4KDTq
— Johns. (@CricCrazyJohns) August 22, 2024