SNP
Rohit Sharma, Mitchell Starc: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో మిచెల్ స్టార్క్ మిచెల్ స్టార్క్ అంటూ అరుపులు.. వాటిని రోహిత్ ఎలా హ్యాండిల్ చేశాడో? ఆ టైమ్ ఎలా రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం.
Rohit Sharma, Mitchell Starc: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో మిచెల్ స్టార్క్ మిచెల్ స్టార్క్ అంటూ అరుపులు.. వాటిని రోహిత్ ఎలా హ్యాండిల్ చేశాడో? ఆ టైమ్ ఎలా రియాక్ట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం.
SNP
టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్ మూడ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యాడు హిట్‌మ్యాన్. రోహిత్ మాట్లాడుతుండగా.. అక్కడున్న కొంతమంది యువకులు.. మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్ అంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో.. నిర్వహకులు వారిని సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ టైమ్‌లో రోహిత్ శర్మ.. ‘కామ్ డౌన్ గాయ్స్’ అంటూ నవ్వుతూ కూల్ చేశాడు. ఇంతకీ రోహిత్ శర్మ మాట్లాడుతున్న టైమ్‌లో వాళ్లు మిచెల్ స్టార్క్ పేరు ఎందుకు తీశారో ఇప్పుడు చూద్దాం..
మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టీమ్‌లో స్టార్ బౌలర్. ఆ జట్టు పేస్ ఎటాక్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా స్టార్క్ మంచి ప్రదర్శన చేశాడు. కానీ, టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కసిగా బ్యాటింగ్ చేసి.. 92 పరుగులతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పేస్ ఎటాక్‌కు పెద్ద దిక్కులాంటి మిచెల్ స్టార్క్‌ను రోహిత్ ఊచకోత కోశాడు.
ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు బాది.. మిచెల్ స్టార్క్ ఈగోను కొట్టాడు. ఆ దెబ్బతో స్టార్క్ అంటే ఏదో పసికూన జట్టు బౌలర్ అన్నట్లు చూశారు అంతా. రోహిత్ తన బౌలింగ్‌లో కొట్టిన సిక్సుల గురించి మిచెల్ స్టార్క్ కూడా ఈ మధ్య స్పందిస్తూ.. నేను వేసిన బ్యాడ్ బాల్స్‌ను రోహిత్ వదలకుండా అన్ని బాల్స్ సిక్సులు కొట్టాడని అన్నాడు. ఇలా టీ20 వరల్డ్ కప్‌లో స్టార్క్‌ను రోహిత్ పిచ్చికొట్టుడు కొట్టడంతో.. ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడలని మిచెల్ స్టార్క్ మిచెల్ స్టార్క్ అంటూ అరిచారు రోహిత్ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Crowd chanting ‘Mitchell Starc’.
– Rohit Sharma says ‘calm down, guys’. 😂 pic.twitter.com/DRDt7nnwfx
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024