Nidhan
Rohit-Ritika: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వస్తున్నాడు. శ్రీలంక సిరీస్‌తో అతడు బరిలోకి అడుగుపెట్టి బ్యాట్‌తో మాయాజాలం చేయనున్నాడు.
Rohit-Ritika: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వస్తున్నాడు. శ్రీలంక సిరీస్‌తో అతడు బరిలోకి అడుగుపెట్టి బ్యాట్‌తో మాయాజాలం చేయనున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మతిమరుపు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు ఇది ప్రూవ్ అయింది. రియల్ లైఫ్‌లోనే కాదు.. ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ తన మతిమరుపుతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు హిట్‌మ్యాన్. ఒకసారి న్యూజిలాండ్‌తో మ్యాచ్ సమయంలో టాస్కు వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్ గురించి మర్చిపోయాడు. టీమ్‌లోకి వచ్చిన కొత్త ప్లేయర్లు ఎవరు? తీసేసిన వాళ్లెవరో మర్చిపోవడంతో లైవ్‌లోనే ఇబ్బంది పడ్డాడు. ఇది చూసి కామెంటేటర్, కివీస్ కెప్టెన్ సహా అభిమానులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. క్రికెట్ మ్యాచ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే భారత సారథి హోటల్ రూమ్స్‌లో ఫోన్లు, పాస్‌పోర్ట్ మర్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
రోహిత్ మతిమరుపు గురించి ఇతర ఆటగాళ్లు షేర్ చేసిన విషయాలు వింటే నవ్వాగదు. ఇప్పుడు మరోమారు గజినీలా మారాడతను. భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు హిట్‌మ్యాన్. బయటికొచ్చి మీడియా వాళ్లను కలిశాక కారు ఎక్కి వెళ్లిపోబోయాడు. అయితే ఇంటికి త్వరగా వెళ్లాలనే కంగారులో ఏకంగా తన బ్యాగులను మర్చిపోయాడు. కారు ఎక్కాక ఈ విషయం గుర్తుకురావడంతో తన సిబ్బందిని పిలిచి బ్యాగుల్ని తీసుకురావాలని చెప్పాడు. దీంతో కారులో హిట్‌మ్యాన్ పక్కనే ఉన్న అతడి సతీమణి రితికా షాకైంది. బ్యాగులు మర్చిపోవడం ఏంటంటూ డిఫరెంట్ రియాక్షన్ ఇచ్చింది.
సిబ్బందిని బ్యాగులు తీసుకురమ్మని ఆదేశించి రోహిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మొత్తం ఘటన మీడియా కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇంత మతిమరుపు ఏంటి భయ్యా అని అంటున్నారు. ఇక, ముంబైకి చేరుకున్న హిట్‌మ్యాన్.. ఒకట్రెండు రోజుల్లో శ్రీలంకకు బయల్దేరనున్నాడు. ఆ టీమ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. అందుకే జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలసి సిరీస్ కోసం బయల్దేరనున్నాడు రోహిత్. టీ20 వరల్డ్ కప్ తర్వాత అతడు ఆడబోయే తొలి సిరీస్ ఇదే కానుంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. కాబట్టి ఇక మీదట ఆడే వన్డే మ్యాచులు టీమ్‌కు చాలా కీలకంగా మారనున్నాయి.
Rohit Sharma and the art of forgetting things. 🤣👌 pic.twitter.com/XTNORB4R9f
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2024