టీమిండియాలో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ! మరి కోహ్లీ?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా సవరించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో టీమిండియా నుంచి రోహిత్‌ ఒక్కడే ఉన్నాడు. అది కూడా 10వ స్థానంలో నిలిచాడు. నిన్నటి వరకు ఆ స్థానంలో రిషభ్‌ పంత్‌ ఉండగా.. ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో సెంచరీతో మూడు స్థానాలు మెరుగుపర్చుకున్న రోహిత్‌ 10వ స్థానానికి ఎగబాకాడు.

అలాగే వన్డే ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్‌ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరఫున టెస్టులు, వన్డేల్లో కలిపి టాప్‌ 10లో ఉన్న ఒకే ఒక క్రికెటర్‌ రోహిత్‌ శర్మ. కెప్టెన్‌గా టీమిండియాను విజయపథంలో నడిపిస్తూనే, ఆటగాడి కూడా రోహిత్‌ శర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. అయితే.. టీమిండియాలో సీనియర్‌ సూపర్‌ స్టార్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

ఇక టీ20 ఫార్మాట్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్‌ యాదవ నంబర్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌ 10లో సూర్య ఒక్కడే ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద.. టెస్టుల్లో టీమిండియా తరఫున రోహిత్‌ శర్మ నంబర్‌ వన్‌ కాగా, వన్డేల్లో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(5వ ర్యాంక్‌) టీమిండియా తరఫున నంబర్‌ వన్‌గా ఉన్నాడు. ఇక టీమిండియాలో ప్రపంచ నంబర్‌ వన్‌గా సూర్య భాయ్‌ ఉన్నాడు. మరి ఈ ర్యాంకింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ వీడియో చూస్తే సచిన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ గ్యారంటీ!

Show comments