Rohit Sharma: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి ముందు రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ కామెంట్స్‌!

రోహిత్‌ శర్మ.. వరల్డ్‌ కప్‌ ఎత్తాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకోసం జట్టును అద్భుతంగా నడిపించాడు. ఓటమి అనేదే ఎరుగకుండా ఫైనల్‌ వరకు చేర్చాడు. కానీ, చివరి మెట్టులో ఓటమి వరల్డ్‌ కప్‌ను దూరం చేసింది. ఆ ఓటమి తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి దిగుతున్న రోహిత్‌ శర్మ.. ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మ.. వరల్డ్‌ కప్‌ ఎత్తాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకోసం జట్టును అద్భుతంగా నడిపించాడు. ఓటమి అనేదే ఎరుగకుండా ఫైనల్‌ వరకు చేర్చాడు. కానీ, చివరి మెట్టులో ఓటమి వరల్డ్‌ కప్‌ను దూరం చేసింది. ఆ ఓటమి తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి దిగుతున్న రోహిత్‌ శర్మ.. ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత.. తొలిసారి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. సౌతాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లీ సైతం మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన రోజు ఈ ఇద్దరు మోడ్రన్‌ లెజెండ్స్‌ ఎంత బాధపడ్డారో మనమంతా కళ్లారా చూశాం. దాదాపు ఇద్దరు కళ్లెంట నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరినీ చూసి యావత్‌ దేశం కన్నీళ్లు పెట్టుకుంది. వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇద్దరు అద్భుతంగా ఆడారు.. జట్టు మొత్తం మంచి ప్రదర్శన కనబరుస్తూ.. ఫైనల్‌ వరకు ఓటమి అనేది లేకుండా దూసుకొచ్చింది. కానీ, అనూహ్యంగా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ఆ ఓటమి బాధ నుంచి బయటపడి.. సౌతాఫ్రికాను వాళ్ల సొంతగడ్డపై టెస్టుల్లో ఎదుర్కొవడానికి రోహిత్‌ సేన సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రోహిత్‌ మీడియాతో ముచ్చటిచ్చాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ముందు మాట్లాడిన రోహిత్‌ శర్మ కాస్త ఎమోషనల్‌గానే కనిపించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత మళ్లీ మ్యాచ్‌ ఆడుతుండటం, ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌గా తొలగించిన తర్వాత తిరిగి గ్రౌండ్‌లోకి దిగనుండటంతో రోహిత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలోనే రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఎదురైన ఓటమి గురించి మాట్లాడుతూ.. ఆ ఓటమి తమనెంతో బాధించిందని రోహిత్‌ పేర్కొన్నాడు.

కాగా, తాము ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో టెస్ట్‌ సిరీస్‌ గెలవలేదని, ఈ సారి టెస్టు సిరీస్‌ గెలిస్తే.. వరల్డ్‌ కప్‌ ఓటమిని మర్చిపోవచ్చని చాలా మంది భావిస్తున్నారని, అది జరగదని, వరల్డ్‌ కప్‌ వరల్డ్‌ కపే అంటూ రోహిత్‌ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌ గెలిస్తే సంతోషమే కానీ, దాన్ని వరల్డ్‌ కప్‌ ఓటమి గాయాన్ని మాన్పుతుందని అనుకోవడం లేదని రోహిత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక కెప్టెన్‌గా, ఒక ఆటగాడిగా రోహిత్‌ శర్మ వన్డే వరల్డ్‌ కప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఒక ఏడాది ముందు నుంచి జట్టును సిద్ధం చేసుకుంటూ.. వరల్డ్‌ కప్‌ టోర్నీలో తన వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి టోటల్‌గా టీమ్‌కోసమే ఆడాడు రోహిత్‌. కానీ, అతనికి కావాల్సిన కప్పు మాత్రం చివరి మెట్టుపై చేజారింది. మరి సౌతాఫ్రికా తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయం సైతం వరల్డ్‌ కప్‌ బాధను తీర్చలేదని రోహిత్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments