iDreamPost
android-app
ios-app

విషం కక్కుతున్న బంగ్లాదేశ్! రోహిత్ జర జాగ్రత్త!

  • Published Sep 09, 2024 | 5:20 PM Updated Updated Sep 09, 2024 | 5:20 PM

IND vs BAN, Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను ఏమాత్రం లైన్‌ తీసుకున్నా.. వాళ్లు విషం కక్కుతారని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs BAN, Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను ఏమాత్రం లైన్‌ తీసుకున్నా.. వాళ్లు విషం కక్కుతారని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 09, 2024 | 5:20 PMUpdated Sep 09, 2024 | 5:20 PM
విషం కక్కుతున్న బంగ్లాదేశ్! రోహిత్ జర జాగ్రత్త!

చాలా గ్యాప్‌ తర్వాత టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ కోసం రెడీ అవుతోంది. ఈ నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనుంది రోహిత్‌ సేన. ఈ సిరీస్‌ కోసం తొలి టెస్ట్‌ ఆడే జట్టును ఆదివారం భారత సెలెక్టర్లు ప్రకటించారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో మంచి స్ట్రాంగ్‌ టీమ్‌నే సెలెక్టర్లు ఎంపిక​ చేశారు. అయినా కూడా భారత క్రికెట్‌ అభిమానుల్లో ఏదో తెలియని భయం వ్యక్తం అవుతోంది. అదేంటంటే.. బంగ్లాదేశ్‌ను చిన్న టీమ్‌గా భావించి.. లైట్‌ తీసుకుంటే దెబ్బతినే ప్రమాదం ఉందని.. క్రికెట్‌ నిపుణులు కూడా అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌ను పాకిస్థాన్‌లో రెండు టెస్టుల్లో ఓడించి వైట్‌వాష్‌ చేసింది బంగ్లాదేశ్‌ జట్టు. అదే ఊపులో ఇండియాపై కూడా చెలరేగాలని భావిస్తోంది.

ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌ టీమిండియాకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. పాకిస్థాన్‌పై తన ఆటగాళ్లు చూపించిన ప్రదర్శనను రిపీట్‌ చేస్తే.. ఇండియాను కూడా ఓడిస్తామని అన్నాడు. అతను అన్నట్లుగా ఇండియాపై బంగ్లాదేశ్‌ విజయ​ం సాధించినా.. పెద్ద విషయం కాదు. ఆట అన్నాకా గెలుపోటములు కామన్‌. కానీ, ఇక్కడ బంగ్లాదేశ్‌ ఇంటెన్షన్‌ను మనం గుర్తించాలి. మన దేశం నుంచి దౌత్యపరంగా ఎంత మేలు జరిగినా, ఎన్ని ప్రయోజనాలు పొందినా.. క్రికెట్‌లో ఇండియాపై గెలవాలనే కసితోనే బంగ్లాదేశ్‌ ఆడుతూ ఉంటుంది. ఇండియాపై గెలిచిన సందర్భాల్లో వరల్డ్‌ కప్‌ గెలిచినట్లు వాళ్లు సంబురాలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సార్లు కసిగా గెలవాలనే ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో గెలిచే మ్యాచ్‌లను కూడా ఓడిపోయింది.

ఏం జరిగినా.. ఇండియాను ఓడించాలనే కసి బంగ్లాదేశ్‌లో చాలా ఉంది. ఏ మాత్రం సందు దొరికినా ఎక్కేయాలని చూస్తూ ఉంటుంది. మ్యాచ్‌లు జరిగేది ఇండియాలోనే, బంగ్లాదేశ్‌లో కాదు, ఇక్కడ వాళ్లకు అంత సీన్‌ ఉండదని మనం అనుకోవచ్చు. కానీ, బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు.. అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుంది. ఇండియాను ఇండియాలో ఓడిస్తే.. ఇక బంగ్లాదేశ్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు. వాళ్ల ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. ఇక విజయం తర్వాత.. వారి అతిని, ఓవర్‌ యాక్షన్‌ను భరించడం సగటు క్రికెట్‌ అభిమానికి చాలా కష్టమే. అలా ఏం కాదు.. టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్లు ఉన్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ.. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఓడిపోయినప్పుడు కూడా జట్టులో రోహిత్‌ శర్మ, కోహ్లీ ఉన్నారు. పైగా ప్రస్తుత జట్టు వాళ్లిద్దరి పైనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. టెస్టుల్లో మరి ఎక్కువగా డిపెండ్‌ అవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం లైట్‌ తీసుకున్నా.. పాము కాటుకు గురికాకతప్పదు. పైగా తొలి టెస్టు చెన్నైలోనే. ఈ పిచ్‌ స్పిన్‌కు స్వర్గధామం అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బంగ్లా టీమ్‌లో మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. స్పిన్‌ బౌలింగ్‌ను ఆడేందుకు తడబడుతున్నాడు. అలాగే ఇతర బ్యాటర్లు కూడా బాల్‌ కాస్త టర్న్‌ అయితే ఇబ్బంది పడుతుంటారు. ఒక్క రోహిత్‌ శర్మ తప్పితే.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్లు మన టీమ్‌లో పెద్దగా కనిపించడం లేదు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను నిజం చేస్తూ.. స్వభావంలో నిజంగా పాములాంటి బంగ్లాదేశ్‌ టీమ్‌కు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా వైట్‌ వాష్‌ చేయాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.