రెండో టెస్టులో రాక్షసుడ్ని దింపుతున్న రోహిత్! బంగ్లాతో నాగినీ డ్యాన్స్ ఖాయం!

Kuldeep Yadav To Play 2nd Test: తొలి టెస్ట్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి ఫుల్ జోష్​లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు సెకండ్ టెస్ట్​కు సిద్ధమవుతోంది. ఇందులోనూ ఆ టీమ్​ను ఓ పట్టు పట్టాలని చూస్తోంది.

Kuldeep Yadav To Play 2nd Test: తొలి టెస్ట్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి ఫుల్ జోష్​లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు సెకండ్ టెస్ట్​కు సిద్ధమవుతోంది. ఇందులోనూ ఆ టీమ్​ను ఓ పట్టు పట్టాలని చూస్తోంది.

చెన్నై టెస్ట్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఫుల్ జోష్​లో ఉంది. తమను ఓడిస్తామంటూ సిరీస్​కు ముందు ఓవరాక్షన్ చేసిన షంటో సేనను మూడు చెరువుల నీళ్లు తాగించడంతో హ్యాపీగా ఉంది టీమిండియా. తొలి టెస్ట్​లో 280 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మెన్ ఇన్ బ్లూ.. కాన్పూర్​లో వాళ్ల కథ ముగించాలని చూస్తోంది. రెండో టెస్ట్​లోనూ నెగ్గి బంగ్లాను వైట్​వాష్ చేయాలని డిసైడ్ అయింది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ కలసి అప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టేశారు. చెన్నై టెస్ట్​లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో సూపర్ సక్సెస్ అవడంతో అదే జోరును కాన్పూర్​లోనూ కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే బంగ్లాను దారుణంగా ఏడిపించిన రోహిత్.. రెండో టెస్ట్​లో ఆ టీమ్ కష్టాలు మరింత పెంచేందుకు ఓ రాక్షసుడ్ని దింపుతున్నాడని తెలుస్తోంది.

బంగ్లాదేశ్​కు చుక్కలు చూపించేందుకు ఓ రాక్షసుడ్ని బరిలోకి దింపనున్నాడట రోహిత్. అతడు వస్తే అపోజిషన్ టీమ్ పిచ్​పై నాగినీ డ్యాన్స్ చేయాల్సిందేనని వినిపిస్తోంది. ఇంతకీ ఆ భీకర ప్లేయర్ ఎవరనే కదా మీ ప్రశ్న. అతడే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అని తెలుస్తోంది. మొదటి టెస్ట్​లో పక్కనబెట్టిన ఈ తోపు స్పిన్నర్​ను సెకండ్ టెస్ట్ కోసం రోహిత్-గంభీర్ రెడీ చేస్తున్నారని సమాచారం. చెన్నై పిచ్​ను పూర్తిగా పేస్​కు అనుకూలంగా తయారు చేయించిన టీమిండియా మేనేజ్​మెంట్.. సెకండ్ టెస్ట్ కోసం కూడా అదే తరహాలో వెళ్లాలని భావిస్తోందట. అయితే సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఊపిరి ఆడకుండా చేసే స్పిన్ రాక్షసుడు కుల్దీప్​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోవాలని ఫిక్స్ అయిందట. దీనికి కొన్ని బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్​కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వతహాగా స్పిన్ వికెట్ అయిన చెపాక్​ను పేస్ పిచ్​గా మార్చారు. అది సక్సెస్ అయింది. దీంతో ఇదే ప్లాన్​ను కాన్పూర్​లోనూ కొనసాగించాలని అనుకుంటున్నారట. అయితే పేస్ బాధ్యతల్ని జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరే పంచుకోనున్నారట. తొలి టెస్ట్​లో ఆకాశ్​దీప్ బాగానే రాణించినా.. ముగ్గురు సీమర్లు వద్దని టీమిండియా మేనేజ్​మెంట్ భావిస్తోందట. ఇండియన్ కండీషన్స్​లో ఎంత పేస్ వికెట్ అయినా ఒకటి, ఒకటిన్నర రోజు మాత్రమే పేస్​కు అనుకూలిస్తుంది. ఆ తర్వాత రెండున్నర నుంచి మూడ్రోజులు మొత్తం స్పిన్​దే హవా. చెన్నై టెస్ట్​ సెకండ్ ఇన్నింగ్స్​లో అశ్విన్ చెలరేగడమే దీనికి ఎగ్జాంపుల్. అందుకే ముగ్గురు పేసర్లకు బదులు ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని రోహిత్ భావిస్తున్నాడట.

ఆకాశ్​దీప్ ప్లేస్​లో కుల్దీప్ యాదవ్​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. అతడు టీమ్​లోకి వస్తే బౌలింగ్ ఎటాక్ మరింత బలంగా మారుతుందని, బంగ్లాను ఇంకా ఈజీగా కుప్పకూల్చొచ్చని ప్లాన్ చేస్తున్నారట. కుల్దీప్ టీమ్​లోకి వస్తాడనేది వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గింగిరాలు తిరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు అతడు పోయించడం ఖాయమని చెబుతున్నారు. ఇంక ఆ టీమ్​కు దబిడిదిబిడేనని అంటున్నారు. ఒకవైపు బుమ్రా, సిరాజ్.. మరోవైపు అశ్విన్, జడేజా, కుల్దీప్ కలిస్తే ఇంక ఆపడం ఎవరి తరం కాదని చెబుతున్నారు. మరి.. కుల్దీప్ ప్లేయింగ్ ఎలెవన్​లోకి వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments