Nidhan
Kuldeep Yadav To Play 2nd Test: తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు సెకండ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఇందులోనూ ఆ టీమ్‌ను ఓ పట్టు పట్టాలని చూస్తోంది.
Kuldeep Yadav To Play 2nd Test: తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు సెకండ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఇందులోనూ ఆ టీమ్‌ను ఓ పట్టు పట్టాలని చూస్తోంది.
Nidhan
చెన్నై టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. తమను ఓడిస్తామంటూ సిరీస్‌కు ముందు ఓవరాక్షన్ చేసిన షంటో సేనను మూడు చెరువుల నీళ్లు తాగించడంతో హ్యాపీగా ఉంది టీమిండియా. తొలి టెస్ట్‌లో 280 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మెన్ ఇన్ బ్లూ.. కాన్పూర్‌లో వాళ్ల కథ ముగించాలని చూస్తోంది. రెండో టెస్ట్‌లోనూ నెగ్గి బంగ్లాను వైట్‌వాష్ చేయాలని డిసైడ్ అయింది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ కలసి అప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టేశారు. చెన్నై టెస్ట్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో సూపర్ సక్సెస్ అవడంతో అదే జోరును కాన్పూర్‌లోనూ కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే బంగ్లాను దారుణంగా ఏడిపించిన రోహిత్.. రెండో టెస్ట్‌లో ఆ టీమ్ కష్టాలు మరింత పెంచేందుకు ఓ రాక్షసుడ్ని దింపుతున్నాడని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించేందుకు ఓ రాక్షసుడ్ని బరిలోకి దింపనున్నాడట రోహిత్. అతడు వస్తే అపోజిషన్ టీమ్ పిచ్‌పై నాగినీ డ్యాన్స్ చేయాల్సిందేనని వినిపిస్తోంది. ఇంతకీ ఆ భీకర ప్లేయర్ ఎవరనే కదా మీ ప్రశ్న. అతడే చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అని తెలుస్తోంది. మొదటి టెస్ట్‌లో పక్కనబెట్టిన ఈ తోపు స్పిన్నర్‌ను సెకండ్ టెస్ట్ కోసం రోహిత్-గంభీర్ రెడీ చేస్తున్నారని సమాచారం. చెన్నై పిచ్‌ను పూర్తిగా పేస్‌కు అనుకూలంగా తయారు చేయించిన టీమిండియా మేనేజ్మెంట్.. సెకండ్ టెస్ట్ కోసం కూడా అదే తరహాలో వెళ్లాలని భావిస్తోందట. అయితే సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఊపిరి ఆడకుండా చేసే స్పిన్ రాక్షసుడు కుల్దీప్ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని ఫిక్స్ అయిందట. దీనికి కొన్ని బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్వతహాగా స్పిన్ వికెట్ అయిన చెపాక్‌ను పేస్ పిచ్‌గా మార్చారు. అది సక్సెస్ అయింది. దీంతో ఇదే ప్లాన్‌ను కాన్పూర్‌లోనూ కొనసాగించాలని అనుకుంటున్నారట. అయితే పేస్ బాధ్యతల్ని జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరే పంచుకోనున్నారట. తొలి టెస్ట్‌లో ఆకాశ్‌దీప్ బాగానే రాణించినా.. ముగ్గురు సీమర్లు వద్దని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. ఇండియన్ కండీషన్స్‌లో ఎంత పేస్ వికెట్ అయినా ఒకటి, ఒకటిన్నర రోజు మాత్రమే పేస్‌కు అనుకూలిస్తుంది. ఆ తర్వాత రెండున్నర నుంచి మూడ్రోజులు మొత్తం స్పిన్‌దే హవా. చెన్నై టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ చెలరేగడమే దీనికి ఎగ్జాంపుల్. అందుకే ముగ్గురు పేసర్లకు బదులు ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని రోహిత్ భావిస్తున్నాడట.
ఆకాశ్‌దీప్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. అతడు టీమ్‌లోకి వస్తే బౌలింగ్ ఎటాక్ మరింత బలంగా మారుతుందని, బంగ్లాను ఇంకా ఈజీగా కుప్పకూల్చొచ్చని ప్లాన్ చేస్తున్నారట. కుల్దీప్ టీమ్‌లోకి వస్తాడనేది వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. గింగిరాలు తిరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లకు అతడు పోయించడం ఖాయమని చెబుతున్నారు. ఇంక ఆ టీమ్‌కు దబిడిదిబిడేనని అంటున్నారు. ఒకవైపు బుమ్రా, సిరాజ్.. మరోవైపు అశ్విన్, జడేజా, కుల్దీప్ కలిస్తే ఇంక ఆపడం ఎవరి తరం కాదని చెబుతున్నారు. మరి.. కుల్దీప్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.