వరల్డ్‌ కప్‌ ట్రోఫీని రోహిత్‌ ఎంత ప్రేమించాడో చెప్పడానికి ఈ వీడియోను సాక్ష్యం!

Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఆ కప్పు అంటే ఎంత ప్రేమనో చెప్పేందుకు ఈ ఒక్క వీడియో సరిపోతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఆ కప్పు అంటే ఎంత ప్రేమనో చెప్పేందుకు ఈ ఒక్క వీడియో సరిపోతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

వరల్డ్‌ కప్‌ గెలవాలని ప్రతి క్రికెటర్‌ కలలుకంటాడు. దాని కోసం తమ శక్తిమేర ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రపంచ కప్‌ను ముద్దాడుతారు. పైగా కెప్టెన్‌గా అతి కొద్ది మంది మాత్రమే.. వరల్డ్‌ కప్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకు అలాంటి అవకాశం రాలేదు. కానీ, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆ ఘనతను అందుకున్నాడు. ఆటగాడిగా ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2007లో టీమిండియా తరఫున టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన రోహిత్‌ శర్మ.. మళ్లీ ఇన్నేళ్లకు కెప్టెన్‌గా టీ20 వరల్డ్‌ కప్‌ సాధించాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ గెలవాలని ఎంతో పరితపించి పోయిన రోహిత్‌ శర్మ.. 2023లో చివరి మెట్టు వరకు వచ్చి.. వరల్డ్‌ కప్‌ను మిస్‌ అయ్యాడు. కానీ, ఆ వెంటనే వచ్చిన టీ20 వరల్డ్‌ కప్‌ అవకాశాన్ని మాత్రం జారవిడవలేదు. పొట్టి కప్పును ఒడిసి పట్టుకున్నాడు. ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ అవతరించిన విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌ సాధించిన తర్వాత.. గురువారం ఉదయం టీమిండియా స్వదేశానికి వచ్చింది. కప్పుతో తిరిగి వచ్చిన రోహిత్‌ సేనకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది.

ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అభిమానుల ఘన స్వాగతం, ఆ తర్వాత హోటల్‌ వద్ద, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అభినందనలు.. ఆ తర్వాత.. ముంబై ఎయిర్‌ పోర్టులో వాటర్‌ సెల్యూట్‌.. అనంతరం.. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే వరకు విక్టరీ పరేడ్‌తో టీమిండియా అద్భుతమైన ఆదరణ దక్కింది. అయితే.. రోహిత్‌ శర్మ కప్పు గెలవాలని ఎంత పరితపించిపోయాడో.. గెలిచిన తర్వాత ఆ కప్పుకు అంతే గౌరవం ఇస్తున్నాడు. తాజాగా కప్పుకు కేక్‌ తగిలితే.. స్వయంగా రోహిత్‌ శర్మనే వరల్డ్‌ కప్‌ను క్లీన్‌ చేశాడు. ఇది చూసి.. రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ అంటే ఎంత ప్రేమో అని క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. రోహిత్‌ శర్మ కప్పును క్లీన్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి రోహిత్‌ కప్పును క్లీన్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments