ఒక్క పనితో అందరి మనసులు గెలుచుకున్న రోహిత్.. సింప్లిసిటీ అంటే ఇదే!

Rohit Sharma Chilling In Dressing Room: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్​ ది ఫీల్డ్​తో పాటు ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఒకేలా ఉంటాడు. అందుకే అతడి వ్యక్తిత్వానికి అంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మరో మంచి పనితో అతడు అందరి మనసులు గెలుచుకున్నాడు.

Rohit Sharma Chilling In Dressing Room: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్​ ది ఫీల్డ్​తో పాటు ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఒకేలా ఉంటాడు. అందుకే అతడి వ్యక్తిత్వానికి అంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మరో మంచి పనితో అతడు అందరి మనసులు గెలుచుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆన్​ ది ఫీల్డ్​తో పాటు ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఒకేలా ఉంటాడు. తోటి ప్లేయర్లతో ఈజీగా కలసిపోతాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా చూపించకుంటా అందర్నీ కలుపుకొని పోతాడు. కెప్టెన్​ అవకముందు నుంచి అతడు ఇలాగే ఉంటున్నాడు. సారథ్యం వచ్చాక అందరితో మరింత కలసిపోవడం స్టార్ట్ చేశాడు. తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ సరదా వాతావరణం నెలకొనేలా చేస్తాడు. తాను కెప్టెన్, గ్రేట్ బ్యాటర్, బిగ్ స్టార్ అనే అహం ఎక్కడా చూపించడు. అందుకే కాబోలు అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా బోలెడు అభిమానులు ఉన్నారు. తాజాగా మరో మంచి పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు హిట్​మ్యాన్. అతడి సింప్లిసిటీకి ఫ్యాన్స్​తో పాటు క్రికెట్ లవర్స్, ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అంతగా రోహిత్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో అందరూ కుర్చీల్లో కూర్చుంటే.. రోహిత్ మాత్రం కింద కూర్చున్నాడు. నేలపై కూర్చొని అతడు చిల్ అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్​లో అందరు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కుర్చీల్లోనే కూర్చుంటారు. అందరికీ చైర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే కెప్టెన్, కోచ్, సీనియర్లతో భయం లేదా గౌరవం వల్ల కొందరు యంగ్​స్టర్స్ దూరంగా వెళ్లి కూర్చుంటారు. ఏ ప్లేయర్ కూడా నేల మీద కూర్చోడు. కానీ రోహిత్ మాత్రం కింద కూర్చునే సరికి అంతా షాక్ అవుతున్నారు. అతడు ఎందుకలా కూర్చున్నాడు అంటూ డిస్కషన్స్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ సింపుల్​గా ఉండేందుకు ఇష్టపడే రోహిత్ అందులో భాగంగానే అలా కింద కూర్చున్నట్లు అనిపిస్తోంది. కంఫర్ట్ లాంటివి పెద్దగా పట్టించుకోని హిట్​మ్యాన్.. తనకు ఏది అనిపిస్తే అది చేసేస్తుంటాడు. రిలాక్స్ అవ్వాలని అనిపించి కింద కూర్చున్నట్లు తెలుస్తోంది.

కింద కూర్చొని చిల్ అవ్వాలని అనుకున్నాడేమో.. అందుకే రోహిత్ కుర్చీలో నుంచి లేచి ఆ పని చేశాడని నెటిజన్స్ కూడా అంటున్నారు. అయితే ఆ ఫొటోలో చూస్తే అక్కడ ఆకాశ్​దీప్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యంగ్​స్టర్స్​తో పాటు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్​ను గమనించొచ్చు. తన కంటే జూనియర్స్, కోచింగ్ స్టాఫ్ ఉన్నా అవేవీ పట్టించుకోకుండా కింద కూర్చోవడాన్ని బట్టి అతడి సింప్లిసిటీని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు నెటిజన్స్. యువ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్​తో మరింత కలిసిపోయేందుకు ఇలాంటి కొన్ని మూమెంట్స్ హెల్ప్ చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఏ భేషజాలకు పోకుండా, స్టార్ స్టేటస్, కెప్టెన్సీ లాంటి హాదాలను పక్కనబెట్టి తనకు నచ్చినట్లు ఉండటం, అందరితో కలసిపోవడం గొప్ప విషయమని.. సింప్లిసిటీ అంటే ఇదే కదా అని అంటున్నారు. దీనికి ఫిదా అయిపోయామని చెబుతున్నారు.

Show comments