Rohit Sharma: రోహిత్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడు.. కానీ తేడా వస్తే మాత్రం..: షమి

Mohammed Shami: రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఏస్ పేసర్ మహ్మద్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడని అన్నాడు. అయితే హిట్ మ్యాన్ సారథ్యాన్ని మెచ్చుకుంటూనే తేడా వస్తే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

Mohammed Shami: రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఏస్ పేసర్ మహ్మద్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడని అన్నాడు. అయితే హిట్ మ్యాన్ సారథ్యాన్ని మెచ్చుకుంటూనే తేడా వస్తే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న తర్వాత భారత్ ను మూడు ఫార్మాట్లలోనూ టాప్ కు చేర్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ తో పాటు వన్డే వరల్డ్ కప్-2023లోనూ టీమిండియాను ఫైనల్స్ కు చేర్చాడు. ఆ రెండు పర్యాయాలు ఐసీసీ ట్రోఫీ మిస్సయినా.. రీసెంట్ గా టీ20 ప్రపంచ కప్ నెగ్గడంతో ఆ కల కూడా నెరవేరింది. తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు డబ్ల్యూటీసీ 2023-2025 కప్పు మీద కన్నేశాడు హిట్ మ్యాన్. ఈ రెండు కప్పులు గెలిస్తే వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీని నెగ్గిన కెప్టెన్ గా చిరకాలం గుర్తుండిపోతాడు రోహిత్. జట్టును ఇంత సమర్థంగా నడిపిస్తున్న అతడ్ని మెచ్చుకోనివారు లేరు. తాజాగా ఏస్ పేసర్ మహ్మద్ షమి కూడా హిట్ మ్యాన్ సారథ్యంపై ప్రశంసలు కురిపించాడు.

రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అని మెచ్చుకున్నాడు షమి. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని అన్నాడు. అయితే కాస్త తేడా వచ్చినా ఊరుకోడని చెప్పాడు. ‘రోహిత్ లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే.. అతడు ఆటగాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. బాగా ప్రోత్సహిస్తాడు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు. ఒకవేళ తప్పు జరిగిందా అతడు సీరియస్ అవుతాడు. క్రమంగా అతడి నుంచి అదే తరహాలో రియాక్షన్స్ వస్తుంటాయి. ఇలా చేయాల్సింది, ఇది నీ దగ్గర నుంచి కావాలని చెబుతాడు. అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే రియాక్షన్స్ దారుణంగా ఉంటాయి. ఆ టైమ్ లో రోహిత్ ఎలా ఉంటాడో స్క్రీన్స్ లో చూస్తూనే ఉంటాం. హిట్ మ్యాన్ రియాక్షన్స్ ను చూసే అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు’ అని షమి చెప్పుకొచ్చాడు.

సియట్ అవార్డుల వేడుకలో షమి ఈ వ్యాఖ్యలు చేశాడు. గ్రౌండ్ లో రోహిత్ బిహేవియర్ ఎలా ఉంటుందనే ప్రశ్నకు షమి ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. షమి కామెంట్స్ తో మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా ఏకీభవించాడు. అయితే రోహిత్ తో కలసి చాన్నాళ్లుగా ఆడుతున్నందున ఏ మూమెంట్ లో ఎలా రియాక్ట్ అవుతాడు, సహచర ప్లేయర్ల నుంచి అతడు ఏం కోరుకుంటున్నాడనేది తమకు అర్థం అవుతుందన్నాడు అయ్యర్. దీనిపై ఇదే ఈవెంట్ లో రోహిత్ జవాబిచ్చాడు. జట్టు ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడేలా చూస్తానని.. ఇందులో భాగంగా తమకు నచ్చినట్లు ఉండమని చెబుతానని అన్నాడు. ముందు తాను నచ్చినట్లు ఉంటే వాళ్లు కూడా అలాగే ఉంటారనే ఉద్దేశంతో గ్రౌండ్ లో సరదాగా, ఒక్కోసారి సిచ్యువేషన్ ను బట్టి సీరియస్ అవుతుంటానని పేర్కొన్నాడు. ఇక, సియట్ అవార్డ్స్ లో రోహిత్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

Show comments