Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్‌కు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కారణమని సురేష్ రైనా అన్నాడు. ఓ విషయంలో మాహీని ఫాలో అవడం వల్లే హిట్‌మ్యాన్ సారథిగా ఇంత విజయవంతం అవుతున్నాడని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్‌కు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కారణమని సురేష్ రైనా అన్నాడు. ఓ విషయంలో మాహీని ఫాలో అవడం వల్లే హిట్‌మ్యాన్ సారథిగా ఇంత విజయవంతం అవుతున్నాడని చెప్పాడు.
Nidhan
ఇటీవల కాలంలో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ను పక్కనబెడితే మిగతా అన్ని టోర్నీల్లోనూ భారత్ ఫుల్ డామినేషన్ కనబరిచింది. ప్రపంచ కప్‌లోనూ ఒక్క ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే లీగ్ దశ నుంచి సెమీస్ వరకు రోహిత్ సేన విజృంభించి ఆడింది. బ్యాట్స్‌మెన్‌గా అదరగొడుతున్న హిట్‌మ్యాన్.. కెప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. టీమ్ అవసరాలకు తగ్గట్లు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. టాలెంట్ ఉన్న యంగ్‌స్టర్స్‌కు అండగా నిలబడుతున్నాడు. అందుకే శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, ముకేశ్ కుమార్ లాంటి యంగ్‌స్టర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. దీని మీద భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. సారథిగా రోహిత్ ఇంతగా సక్సెస్ అవడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఫాలో అవడమే కారణమన్నాడు.
ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ ఇంత పటిష్టంగా మారడానికి రోహిత్ శర్మే కారణమని చెప్పాడు రైనా. ఇది అతడి జట్టు అన్నాడు. హిట్‌మ్యాన్ ఇస్తున్న ఎంకరేజ్మెంట్ వల్లే దూబె లాంటి వారు రాణిస్తున్నారని మెచ్చుకున్నాడు. ‘ఇది పూర్తిగా రోహిత్ శర్మ టీమ్. జట్టులోని ప్లేయర్లు అందరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ మాత్రమే కాదు ఈ సీజన్ మొత్తం అతడు రాణిస్తూ వచ్చాడు. గత ఐపీఎల్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సీఎస్కే కెప్టెన్ ధోని తనను నమ్మే స్థాయికి ఎదిగాడతను. ధోనీలాగే రోహిత్ కూడా దూబె మీద నమ్మకం ఉంచడం వల్లే అతడు కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు’ అని రైనా చెప్పుకొచ్చాడు. తన టీమ్‌లోని యంగ్‌స్టర్స్ మీద ధోని నమ్మకం ఉంచుతాడని.. అదే పని ఇప్పుడు హిట్‌మ్యాన్ కూడా చేసి సక్సెస్ అవుతున్నాడని పేర్కొన్నాడు.
సెకండ్ టీ20లో బ్యాట్లతో ఆఫ్ఘాన్‌పై విరుచుకుపడిన జైస్వాల్, దూబేను పొగడ్తల్లో ముంచెత్తాడు రైనా. వాళ్లు చాలా పాజిటివ్‌గా ఆడారని తెలిపాడు. అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రయోజనం పొందారన్నాడు. ‘జైస్వాల్-దూబె సానుకూలంగా ఆడారు. అటాకింగ్ అప్రోచ్‌తో అలవోకగా పరుగులు రాబట్టారు. వాళ్లిద్దరి బ్యాట్ స్వింగ్ బాగుంది. బాల్‌ను చక్కగా మిడిల్ చేస్తున్నారు. దీని వల్ల బాల్ ఈజీగా బౌండరీ దాటుతోంది. ఇదంతా ప్రాక్టీస్ చేయడం వల్లే సాధ్యం. భయాన్ని దరిచేరనీయకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడటం మంచి విషయం. ఇది మన జట్టు బలం ఏంటో చాటుతోంది’ అని రైనా వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్ కప్-2024కు ముందు జట్టు ప్లేయర్లు అంతా ఫామ్‌లోకి రావడం చాలా అవసరం అని వివరించాడు. ఇక ఆఫ్ఘాన్‌తో సిరీస్‌ను మరో టీ20 ఉండగానే కైవసం చేసుకుంది భారత్. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ బుధవారం చెన్నైలోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మరి.. రోహిత్ సక్సెస్ గురించి రైనా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: కేదార్ జాదవ్ గుర్తున్నాడా? భారీ స్కోర్ సాధించినా అవమానం!
Suresh Raina said, “this is captain Rohit Sharma’s team. Rohit will definitely want in form players and Shivam Dube has impressed a lot. Rohit has given Dube the same confidence as MS Dhoni”. (JioCinema). pic.twitter.com/IsO2Pkbx2i
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2024