Nidhan
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్‌మ్యాన్ రోహిత్. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్‌మ్యాన్ రోహిత్. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సొంతమవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు హిట్‌మ్యాన్ రోహిత్. చిరకాల కోరిక నెరవేరడంతో అతడి సంతోషానికి పగ్గాల్లేకుండా పోయింది. ప్లేయర్‌గా టీ20 వరల్డ్ కప్-2007ను గెలుచుకున్న టీమ్‌లో భాగంగా ఉన్నాడు హిట్‌మ్యాన్. కెరీర్ ఆరంభంలోనే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాడు. అయితే ఆ తర్వాత సీనియర్‌గా మారడం, వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకోవడం, కెప్టెన్సీ కూడా చేపట్టడం తెలిసిందే. అయితే అతడు ఎంత ఎదిగినా జట్టుకు మరో కప్పు మాత్రం అందివ్వలేకపోయాడు. ఎట్టకేలకు పొట్టి ప్రపంచ కప్-2024తో ఆ కల తీరింది. విక్టరీ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు తదుపరి అసైన్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు హిట్‌మ్యాన్.
శ్రీలంకతో ఆగస్టు మొదటి వారంలో జరిగే వన్డే సిరీస్‌తో మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నాడు రోహిత్. మరో రెండు, మూడ్రోజుల్లో పొరుగు దేశానికి అతడు పయనం కానున్నాడు. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండటంతో దాని మీద అతడు దృష్టి పెట్టాడు. మరో ఐసీసీ ట్రోఫీని గెలుచుకొని కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నాడు. 37 ఏళ్ల రోహిత్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాడో చెప్పలేని పరిస్థితి. అయితే అతడిలో ఇంకా చాలా క్రికెట్ ఉందని.. ఫిట్‌గా ఉంటే వన్డే వరల్డ్ కప్-2027లో కూడా ఆడతాడని కొత్త కోచ్ గౌతం గంభీర్ ఇటీవల స్పష్టం చేశాడు. దీంతో రోహిత్‌ను ఇంకో ప్రపంచ కప్‌లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే అతడు మరో మెగాటోర్నీలో ఆడటం కష్టమేనని.. స్పృహ తప్పి పడిపోతాడని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంటున్నాడు.
రోహిత్ వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఆడటం సాధ్యం కాదన్నాడు క్రిష్ శ్రీకాంత్. కానీ మరో సీనియర్ విరాట్ కోహ్లీ మాత్రం ఆ టోర్నీ బరిలో దిగడం ఖాయమన్నాడు. కోహ్లీ హై ఫిట్నెస్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తున్నాడని, కాబట్టి ఇంకోసారి మెగాటోర్నీలో ఆడటం పెద్ద సమస్య కాదన్నాడు. కానీ రోహిత్‌కు మాత్రం కుదరదన్నాడు. 37 ఏళ్ల రోహిత్‌కు వన్డే వరల్డ్ కప్-2027 కల్లా 40 ఏళ్లు వస్తాయని, ఆ ఏజ్‌లో బ్యాటింగ్ చేయడం ఈజీ కాదన్నాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ లాంటి సూపర్ ఫిట్ ప్లేయర్లు మాత్రం ఆ వయసులోనూ అదే రేంజ్లో ఆడగలరని.. రోహిత్ వల్ల కాదన్నాడు. ఒకవేళ అతడ్ని వన్డే ప్రపంచ కప్ కోసం సౌతాఫ్రికాకు తీసుకెళ్తే అతడు స్పృహ తప్పి పడిపోవడం ఖాయమన్నాడు. మరి.. రోహిత్ వచ్చే వరల్డ్ కప్‌లో ఆడగలడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.