iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్-కోహ్లీ అప్పటివరకు ఆడతారు.. తక్కువ అంచనా వేయొద్దు: హర్భజన్

  • Published Aug 12, 2024 | 7:58 PM Updated Updated Aug 12, 2024 | 7:58 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్న ఈ మోడర్న్ లెజెండ్స్.. సాధ్యమైనంత ఎక్కువ కాలం గేమ్​లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్న ఈ మోడర్న్ లెజెండ్స్.. సాధ్యమైనంత ఎక్కువ కాలం గేమ్​లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • Published Aug 12, 2024 | 7:58 PMUpdated Aug 12, 2024 | 7:58 PM
Rohit-Kohli: రోహిత్-కోహ్లీ అప్పటివరకు ఆడతారు.. తక్కువ అంచనా వేయొద్దు: హర్భజన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పొట్టి ప్రపంచ కప్-2024తో టీ20ల నుంచి వీళ్లు రిటైర్మెంట్ తీసుకున్నారు. దీంతో కోట్లాది మంది అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఈ స్టార్లు మళ్లీ టీ20ల్లో కనిపించరనే బాధతో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అయితే వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్న ఈ మోడర్న్ లెజెండ్స్.. ఐపీఎల్ రూపంలో ఏడాదికోసారి పొట్టి ఫార్మాట్​లో అలరించనున్నారు. కానీ వీళ్లిద్దరూ క్రికెట్​లో ఇంకా ఎన్ని ఏళ్లు కొనసాగుతారనేది చెప్పలేని పరిస్థితి. అభిమానులు మాత్రం ఈ ఇద్దరు స్టార్లు సాధ్యమైనంత ఎక్కువ కాలం గేమ్​లో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు.

రోకో జోడీ మరింత కాలం తమను ఎంటర్​టైన్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ల బ్యాటింగ్ విధ్వంసాన్ని ఇంకా చూడాలని అనుకుంటున్నామని చెబుతున్నారు. యంగ్​స్టర్స్ వాళ్ల రేంజ్​లో ఆడే వరకు ఇలాగే టీమ్​తో ఉండి గైడ్ చేయాలని సూచిస్తున్నారు. ఈ అంశంపై టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. రోహిత్-కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు. వాళ్లలో ఎంతో క్రికెట్ ఇంకా మిగిలే ఉందన్నాడు. వాళ్లు ఇప్పుడప్పుడే రిటైర్ కారని.. దానికి చాలా టైమ్ ఉందన్నాడు. హిట్​మ్యాన్ ఈజీగా ఇంకో రెండేళ్లు క్రికెట్ ఆడగలడని తెలిపాడు భజ్జీ. అయితే విరాట్ కోహ్లీ ఫిట్​నెస్​ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

‘రోహిత్-విరాట్​లో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది. వాళ్లు ఇప్పుడప్పుడే రిటైర్ అవ్వరు. రోహిత్ అలవోకగా ఇంకో రెండేళ్లు ఆడగలడు. కోహ్లీ గురించి మాత్రం ఏమీ చెప్పలేను. ఎందుకంటే, అతడి ఫిట్​నెస్​ను అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. అతడు మరో 5 ఏళ్లు క్రికెట్​లో కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్​లో అతడ్ని మించిన ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇంకొకరు లేరు. రోహిత్-కోహ్లీ ఇంకొన్నేళ్లు కలసి ఇదే విధంగా భారత జట్టుకు సేవలు అందించాలనేది నా కోరిక’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇక, టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్​లు లేకపోవడంతో రోకో జోడీ రెస్ట్ తీసుకుంటున్నారు. వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్​ సిరీస్​తో వాళ్లు కమ్​బ్యాక్ ఇస్తారు. అయితే ఈమధ్యలో దులీప్ ట్రోఫీ-2025లో ఈ లెజెండ్స్ మెరిసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఆడేలా వీళ్లను భారత బోర్డు, కోచ్ గంభీర్ కన్విన్స్ చేశారని తెలుస్తోంది.