iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఏం సాధించాడు? రోహిత్‌ ప్లానేంటి? WC కంటే పెద్ద టార్గెట్‌!

  • Published Mar 09, 2024 | 7:44 PM Updated Updated Mar 09, 2024 | 7:44 PM

Rohit Sharma, Team India: ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలిచింది. అయితే.. ఈ సిరీస్‌ విజయంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏం సాధించాడు? సిరీస్‌ గెలవడమే అతని లక్ష్యమా? లేక ఇంకా పెద్ద టార్గెట్‌ ఏమైనా ఉందా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Team India: ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలిచింది. అయితే.. ఈ సిరీస్‌ విజయంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏం సాధించాడు? సిరీస్‌ గెలవడమే అతని లక్ష్యమా? లేక ఇంకా పెద్ద టార్గెట్‌ ఏమైనా ఉందా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Mar 09, 2024 | 7:44 PMUpdated Mar 09, 2024 | 7:44 PM
ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఏం సాధించాడు? రోహిత్‌ ప్లానేంటి? WC కంటే పెద్ద టార్గెట్‌!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుని.. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న తొలి కెప్టెన్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. పైగా విరాట్‌ కోహ్లీ, షమీ లాంటి సీనియర్లు లేకపోయినా, కేఎల్‌ రాహుల్‌ గాయంతో దూరమైనా, జడేజా, బుమ్రా ఒక్కో మ్యాచ్‌ ఆడకపోయినా.. యువ క్రికెటర్లతో కలిసి ఇంగ్లండ్‌ లాంటి పటిష్టమైన టీమ్‌పై రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌ విజయం సాధించాడు. అయితే.. ఈ సిరీస్‌ విజయం పక్కనపెడితే.. రోహిత్‌ ఒక పెద్ద టార్గెట్‌ను కొంతమేర రీచ్‌ అయినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ సిరీస్‌పై రోహిత్‌ ఇంత ఫోకస్‌ పెట్టి.. ఏ మాత్రం రెస్ట్‌ తీసుకోకుండా పూర్తిగా ఐదు టెస్టులు ఆడటానికి ఒక బలమైన కారణం ఉంది. నాలుగో టెస్టుతో సిరీస్‌ కైవసం అయినా నామమాత్రపు ఐదో టెస్ట్‌ రోహిత్‌ ఆడటం వెనుక ఒక సంకల్పం, వరల్డ్‌ కప్‌ సాధించాలనే కల కంటే పెద్ద టార్గెట్‌ ఉంది. అందుకే రోహిత్‌ శర్మ అంత తపన పడుతున్నాడు. అసలు రోహిత్‌ టార్గెట్‌ ఏంటి? దాన్ని రీచ్‌ అవుతాడా? ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో తన టార్గెట్‌కు ఎంత దగ్గరయ్యాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్‌ బిగ్గెస్ట్‌ గోల్‌ ఏంటో అందరికి తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించడం అతని కల. ఆ టార్గెట్‌కు 2023 వన్డే వరల్డ్‌ కప్‌తో ఆల్‌మోస్ట్‌ దగ్గరికి వచ్చి ఫైనల్లో ఓటమితో మిస్‌ అయ్యాడు. మళ్లీ నాలుగేళ్లకు వన్డే వరల్డ్‌ కప్‌. అప్పటి వరకు రోహిత్‌ క్రికెట్‌లో కొనసాగుతాడా? అంటే.. కష్టమే. ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్నా.. రోహిత్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ ఇచ్చిన సంతృప్తి టీ20 వరల్డ్‌ కప్‌ ఇవ్వదు. ఆ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. అందుకోసమే.. మరో వన్డే వరల్డ్‌ కప్‌ ఆడతానో లేదో అనే డౌట్‌తో రోహిత్‌ ఆ వరల్డ్‌ కప్‌ను మించిన టార్గెట్‌ను సెట్‌ చేసుకున్నాడు. అది కూడా అతని కోసం కాదు.. టీమ్‌ కోసం, దేశం కోసం. ఆ టార్గెట్‌ ఏంటంటే.. నెక్ట్స్‌ టీమిండియాను నిర్మించడం. భారత క్రికెట్‌ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా ఒక మంచి టీమ్‌ను నిర్మించి.. తనను మించే కెప్టెన్‌ చేతుల్లో టీమ్‌ను పెట్టడం. ఇప్పుడిదే రోహిత్‌ టార్గెట్‌.

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైర్‌ అయిపోతే.. టీమిండియాకు పెద్ద దిక్కు లేకుండా పోతుంది. వారి స్థానాలను భర్తీ చేసే క్రమంలో టీమ్‌ విక్‌ అయిపోతే.. ప్రపంచ క్రికెట్‌ ముందు టీమిండియా మరో వెస్టిండీస్‌ అయిపోతుందేమో అనే భయం చాలా మంది క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. అందుకే రోహిత్‌ కొత్త టీమిండియాను బిల్డ్‌ చేసే పనిలో పడ్డాడు. దాని కోసం ఈ ఇంగ్లండ్‌ సిరీస్‌ను అద్భుతంగా వాడుకున్నాడు. విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం కావడం, షమీ, రాహుల్‌ గాయాలో టీమ్‌లో లేకపోవడంతో చాలా మంది యువ క్రికెటర్లకు ఛాన్సులిచ్చాడు రోహిత్‌. బుమ్రాకు ఒక మ్యాచ్‌లో రెస్ట్‌ ఇచ్చి మరీ కొత్త బౌలర్‌తో అరంగేట్రం చేయించాడు. ఈ సిరీస్‌లో ఓ ఐదుగురు ఆటగాళ్లు డెబ్యూ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. రోహిత్‌ టీమ్‌ బిల్డ్‌పై ఎంత ఫోకస్‌గా ఉన్నాడో.

Rohit Sharma next big match

ఒక్క రజత్‌ పాటిదార్‌ తప్పితే మిగతా అందరు రోహిత్‌ అంచనాలను అందుకున్నారు. పాటిదార్‌ను కూడా ఒక్క సిరీస్‌తో కొట్టిపారేయలేం. కానీ, శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, కుల్దీప్‌ రూపంలో ఇప్పటికే టీమిండియాలో ప్లేస్ సుస్థిరం చేసుకున్న యంగ్‌ బ్లడ్‌ ఉంది. వీరికి సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, దేవదత్త్‌ పడిక్కల్‌ జతకలిసేలా ఉన్నారు. వీరింతా ఇంగ్లండ్‌పై మంచి ప్రదర్శన కనబర్చిన వారే. వీరే భవిష్యత్తులో టీమిండియా స్టార్లుగా వెలుగొందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లండ్‌పై సిరీస్‌లో వీరి ప్రదర్శనతో రోహిత్‌ శర్మ తన టార్గెట్‌ను కొంత వరకు రీచ్‌ అయ్యేడనే చెప్పాలి. వీరితో పాటు టీ20ల్లో రింకూ సింగ్‌, శివమ్‌ దూబే లాంటి యువకులను పర్మినెంట్‌ చేసి.. ఒక నిఖార్సయిన టీమిండియాను బిల్డ్‌చేసి.. తన తర్వాతి కెప్టెన్‌ చేతిలో టీమిండియాను పెట్టేస్తే.. రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ గెలిచిన దాని కంటే కూడా భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసిన వాడు అవుతాడు.

ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఇలాగే ఒక యంగ్‌ టీమిండియాను నిర్మించాడు. తన చేతుల్లోకి కెప్టెన్సీ వచ్చిన తర్వాత.. వరల్డ్‌ కప్‌ గెలవడమే లక్ష్యంగా సచిన్‌, ద్రవిడ్‌, కుంబ్లేలను కలుపుకుని వెళ్తూ.. వీరేందర్‌ సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌సింగ్‌, కైఫ్‌ లాంటి జూనియర్లను టీమ్‌లోకి తీసుకుని.. ఒక స్ట్రాంగ్‌ టీమ్‌ను నిర్మించుకున్నాడు. 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లిన గంగూలీ సేన.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కానీ, గంగూలీ నిర్మించిన టీమ్‌.. 2011లో వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఒక సారి 2011 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌ను పరిశీలిస్తే.. యువరాజ్‌ సింగ్‌, సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌, ధోని ఇలా స్టార్లంతా గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలో షైన్‌ అయిన వారే. వారిలో కొందరిని ఏరికోరి మరీ గంగూలీ టీమ్‌లో పెట్టుకున్నాడు. గంగూలీ లేకుంటే ధోని, సెహ్వాగ్‌ లాంటి వాళ్లు టీమిండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయి ఉండేవారు.

ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా సేమ్‌ గంగూలీలానే చేస్తున్నాడు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ మిస్‌ అయినా.. శుబ్‌మన్‌ గిల్‌, జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కుల్దీప్‌ యాదవ్‌, ధృవ్‌ జురెల్‌, రింకూ సింగ్‌ లాంటి వారితో కూడిన జట్టు వరల్డ్‌ కప్‌ నెగ్గితే.. ఇప్పుడు రోహిత్‌ పడుతున్న కష్టానికి ఫలితం దక్కినట్లు అవుతుంది. అదే జరిగితే.. జట్టును నిర్మించిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ చరిత్రలో నిలిచిపోతాడు. తన కెప్టెన్సీలో కప్పు కొట్టలేకపోయినా.. తాను నిర్మించిన జట్టు కప్పు కొడితే వచ్చే కిక్కే వేరు. మరి రోహిత్‌ శర్మ ఆ టార్గెట్‌ను రీచ్‌ అవుతాడని, అతను నిర్మిస్తున్న ఈ యంగ్‌ టీమ్‌ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని మీరూ భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.