iDreamPost
android-app
ios-app

ఆఫ్గాన్ బౌలర్లపై రోహిత్ ‘శతక’ యుద్ధం! సచిన్ చిరకాల రికార్డు బద్దలు..

  • Author Soma Sekhar Published - 08:48 PM, Wed - 11 October 23
  • Author Soma Sekhar Published - 08:48 PM, Wed - 11 October 23
ఆఫ్గాన్ బౌలర్లపై రోహిత్ ‘శతక’ యుద్ధం! సచిన్ చిరకాల రికార్డు బద్దలు..

వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో దుమ్మురేపాడు. ఆఫ్గాన్ బౌలర్లపై రోహిత్ ‘శతక’ యుద్ధాన్ని ప్రకటించాడు. క్రీజ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అతడు కనికరం లేకుండా ప్రత్యర్థిపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 63 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసి.. సచిన్ టెండుల్కర్ చిరకాల రికార్డుతో పాటుగా టీమిండియా మరో దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును అలాగే క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. రోహిత్ భారీ శతకంతో టీమిండియా విజయం వైపు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇక రోహిత్ సాధించిన రికార్డుల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారీ శతకంతో చెలరేగాడు. 63 బంతుల్లోనే సెంచరీ బాదాడు రోహిత్ శర్మ. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో మెుత్తం 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కాగా.. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే సచిన్ వరల్డ్ కప్ లో నెలకొల్పిన చిరకాల రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు సచిన్ 6 సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పగా.. ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు రోహిత్.

కాగా.. సచిన్ 44 ఇన్నింగ్స్ ల్లో 6 సెంచరీలు చేస్తే.. రోహిత్ కేవలం 19 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ల్లోనే 7 శతకాలు బాది ఔరా అనిపించాడు. ఈ రికార్డుతో పాటుగా టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ వరల్డ్ కప్ లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు రోహిత్. కపిల్ దేవ్ వరల్డ్ కప్ లో 72 బంతుల్లో సెంచరీ చేయగా.. రోహిత్ కేవలం 63 బంతుల్లోనే ఈ ఫీట్ ను సాధించాడు. ఈ రికార్డులే కాక.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సుల రికార్డును కూడా ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. మరి ఒకే మ్యాచ్ లో ఇన్ని రికార్డులు బ్రేక్ చేసిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.