వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 273 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రత్యర్థి బౌలర్లను అల్లాడిస్తూ.. కేవలం 11 ఓవర్లలోనే స్కోర్ బోర్డ్ ను 100 పరుగులకు చేర్చారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ సిక్సులు, ఫోర్లతో ఆఫ్గాన్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు అయిన అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటికే 4 సిక్సర్లు బాది.. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఆఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ ఇప్పటికే 4 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు గేల్ 551 మ్యాచ్ ల్లో 553 సిక్సులు కొడితే.. రోహిత్ కేవలం 473 మ్యాచ్ ల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు టీమిండియా కెప్టెన్. కాగా.. రోహిత్ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఏ ఆటగాడు లేడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం 14 ఓవర్లలకు టీమిండియా వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. అర్ద సెంచరీ సాధించి.. సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ 48 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 30 పరుగులతో అతడికి అండగా నిలుస్తూ వస్తున్నాడు. మరి సిక్సర్ల కింగ్ గా అవతరించిన రోహిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Most international sixes (innings):
Rohit Sharma – 554* (473).
Chris Gayle – 553 (551).
– The GOAT opener, the boss of six hitting, the Hitman…!!! pic.twitter.com/s0nCqw4Tqr
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023