iDreamPost
android-app
ios-app

వరల్డ్ క్రికెట్ లోనే రోహిత్ శర్మ అరుదైన ఘనత! ఏకైక ప్లేయర్ గా..

  • Author Soma Sekhar Updated - 07:09 PM, Fri - 1 December 23

గత వరల్డ్ కప్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా మరో అరుదైన, ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

గత వరల్డ్ కప్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా మరో అరుదైన, ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Updated - 07:09 PM, Fri - 1 December 23
వరల్డ్ క్రికెట్ లోనే రోహిత్ శర్మ అరుదైన ఘనత! ఏకైక ప్లేయర్ గా..

రోహిత్ శర్మ.. కెప్టెన్ గా, బ్యాటర్ గా టీమిండియాని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడంతో.. అతడు సారథ్యాన్ని పగ్గాలను విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు కూడా రోహిత్ నే కెప్టెన్ గా ఉంచాలని చూస్తోంది. ఇది కొద్దిసేపు పక్కనపెడితే.. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ బద్దలు కొట్టిన రికార్డుల సంఖ్య పదుల్లో ఉంది. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు.

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇప్పటికే ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డులను తన అకౌంట్ లో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తాజాగా ప్రపంచంలోనే ఎవ్వరూ కూడా దాదాపు టచ్ చేయలేని రికార్డును నెలకొల్పాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? వన్డే క్రికెట్ చరిత్రలో 10 వేర్వేరు సంవత్సరాల్లో 50కి పైగా యావరేజ్ సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ శర్మ 2013 నుంచి ఇప్పటి వరకు వన్డేల్లో ప్రతీ క్యాలెండర్ ఇయర్ లో 50కి పైగా యావరేజ్ తో పరుగులు చేస్తూ వస్తున్నాడు. వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఇదో అరుదైన ఘనత.

ఇక ఈ రికార్డు గురించి తెలుసుకున్న హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘రికార్డులందు.. ఈ రికార్డు వేరయా’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓపెనర్ గా ఉంటూ ఈ ఘనత సాధించడం మామూలు విషయం కాదని మరికొందరు నెటిజన్లు పొగుడుతున్నారు. మరి రోహిత్ ఈ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.