iDreamPost
android-app
ios-app

సచిన్‌కు కూడా సాధ్యం కానీ రికార్డును సాధించిన రోహిత్‌ శర్మ!

  • Published Nov 12, 2023 | 6:35 PM Updated Updated Nov 12, 2023 | 6:35 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వరల్డ్‌ కప్‌లో కేవలం జట్టుకు మంచి స్టార్ట్‌ అందించాలనే గోల్‌తోనే ఆడుతున్న రోహిత్‌.. ఈ క్రమంలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా అది సచిన్‌ కూడా సాధ్యం కానీ, అరుదైన రికార్డు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వరల్డ్‌ కప్‌లో కేవలం జట్టుకు మంచి స్టార్ట్‌ అందించాలనే గోల్‌తోనే ఆడుతున్న రోహిత్‌.. ఈ క్రమంలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా అది సచిన్‌ కూడా సాధ్యం కానీ, అరుదైన రికార్డు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 12, 2023 | 6:35 PMUpdated Nov 12, 2023 | 6:35 PM
సచిన్‌కు కూడా సాధ్యం కానీ రికార్డును సాధించిన రోహిత్‌ శర్మ!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ డుపర్‌గా దూసుకెళ్తోంది. అసలు ఏ టీమ్‌ ఎదురైనా.. కాస్త కూడా కనికరం చూపకుండా చీల్చిచెండాడుతోంది. అది పెద్ద టీమా? చిన్న టీమా అనే తేడా లేకుండా తుప్పురెగ్గొడుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్‌ 8 టీమ్స్‌ను ఓడించిన రోహిత్‌ సేన.. ఇప్పుడు పసికూన నెదర్లాండ్స్‌పై పడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 410 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో విరుచుకుపడగా.. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. మొత్తానికి టీమిండియా బ్యాటర్లంతా పరుగుల పండుగ చేసుకున్నారు. అయితే.. ఈ క్రమంలో టీమిండియా రోహిత్‌ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డు అది. అంతేందుకు క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాలేదు అంత గొప్ప రికార్డు అది. టీమిండియా తరఫున అత్యంత గొప్ప బ్యాటర్‌గా ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ ఏకంగా 4 వరల్డ్‌ కప్స్‌ ఆడాడు. అయినా కానీ అలాంటి రికార్డు సాధించలేదు. అలాగే మరో మోడ్రన్‌ లెజెండ్‌ విరాట్‌ కోహ్లీ కూడా మూడో వరల్డ్‌ కప్‌ ఆడుతున్నాడు. అతనికి కూడా సాధ్యం కాలేదు. కానీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం అది సాధించి చూపించాడు. ఆ రికార్డు ఏంటంటే.. వరుసగా రెండు వన్డే వరల్డ్‌ కప్స్‌లో 500 ప్లస్‌ పరుగులు చేసి ఒకే ఒక్క ఆటగాడు రోహిత్‌ శర్మ.

ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి రికార్డు మరె ఆటగాడికి లేదు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో ఏకంగా 648 పరుగులు చేశాడు రోహిత్‌ శర్మ. పైగా వరల్డ్‌ కప్‌లో 5 సెంచరీలు నమోదు చేశారు. ఇది కూడా ఒక రికార్డే. అలాగే ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు 503 పరుగుల చేశాడు. సెమీ ఫైనల్‌ ఇంకా మిగిలి ఉంది. ఇలా వరుసగా రెండు వన్డే వరల్డ్‌ కప్పుల్లో 500 ప్లస్‌ పరుగులు చేసి ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. ఈ వరల్డ్‌ కప్‌లో ఒక సెంచరీ, మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్‌.. నాలుగో స్థానంలో ఉన్నాడు. 594 పరుగులతో విరాట్‌ కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. 591 రన్స్‌తో సౌతాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, 565 రన్స్‌తో న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర ఉన్నారు. మరి వరుస రెండు వన్డే వరల్డ్‌ కప్స్‌లో 500 పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.