iDreamPost

వీడియో: ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న పాక్‌ ప్లేయర్‌ నసీమ్‌ను ఓదార్చిన రోహిత్‌!

  • Published Jun 10, 2024 | 2:32 PMUpdated Jun 10, 2024 | 2:32 PM

Rohit Sharma, Naseem Shah, IND vs PAK, T20 World Cup 2024: చిరకాప ప్రత్యర్థి పాక్‌పై టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఓటమి బాధను తట్టుకోలేక నసీమ్‌ షా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని రోహిత్‌ శర్మ ఏ విధంగా ఓదార్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Naseem Shah, IND vs PAK, T20 World Cup 2024: చిరకాప ప్రత్యర్థి పాక్‌పై టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఓటమి బాధను తట్టుకోలేక నసీమ్‌ షా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని రోహిత్‌ శర్మ ఏ విధంగా ఓదార్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 10, 2024 | 2:32 PMUpdated Jun 10, 2024 | 2:32 PM
వీడియో: ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న పాక్‌ ప్లేయర్‌ నసీమ్‌ను ఓదార్చిన రోహిత్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా దాయాది పోరు సూపర్‌గా జరిగింది. క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలు క్రికెట్‌ మజాను అందిస్తూ.. భారత్‌-పాక్‌ మధ్య లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌ సాగింది. పరుగులు చేయడానికి బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్న పిచ్‌పై.. రెండు దేశాల బౌలర్ల మధ్య ఓ యుద్ధమే జరిగింది. చివరికి జస్ప్రీత్‌ బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ ఉన్న టీమిండియా విజేతగా నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప స్కోర్‌ను కాపాడుకుంటూ.. భారత బౌలర్లు అద్వితీయమైన విజయాన్ని అందించారు. అయితే.. భారత్‌పై ఓటమిని జీర్ణించుకోలేక పాక్‌ స్టార్‌ బౌలర్‌ నసీమ్‌ షా గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

అయితే.. ఓటమి బాధలో కన్నీళ్లు పెట్టుకున్న నసీమ్‌ షాను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ ఓదార్చడం అందర్ని ఆకట్టుకుంది. ప్రత్యర్థి ఆవేదనను అర్థం చేసుకుని.. అతన్ని ఓదార్చడంతో రోహిత్‌ క్రికెట్‌ అభిమానుల హృదాయాలను గెలుచుకున్నాడు. బౌలింగ్‌ మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్‌లో 4 బంతుల్లో 10 పరుగులు చేసి విజయం కోసం తన శక్తికి మించి పోరాటం చేశాడు నసీమ్‌ షా. కానీ టీమిండియా బౌలర్ల అద్భుతం ముందు అతని పోరాటం సరిపోలేదు. దీంతో.. ఓటమి తప్పలేదు. ఈ ఓటమి తట్టుకోలేక.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు వెళ్తూ షా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను ఏడుస్తుంటే.. మరో బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ, నసీమ్‌ను ఓదార్చాడు.

కాగా, మ్యాచ్‌ ముగియగానే.. చివరి ఓవర్‌ వేసిన టీమిండియా బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ను అభినందించిన రోహిత్‌ శర్మ.. వెంటనే నసీమ్‌ షా దగ్గరికి వెళ్లి అతన్ని అభినందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అతను చూపించిన పోరాట స్ఫూర్తికి ఫిదా అయిపోయిన రోహిత్‌.. నసీమ్‌ ఏడుస్తుంటే ఓదార్చాడు. గెలుపోటములు అనేవి సహజం అని అతన్ని కాస్త మోటివేట్‌ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా నసీమ్‌ కన్నీళ్లు ఆగలేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లేంత వరకు అతను ఏడుస్తూనే ఉన్నాడు. మరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లోని ఓ ఆటగాడు ఓటమి బాధలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే.. టీమిండియా కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ అతన్ని ఓదార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి