Nidhan
టీమిండియాలో స్టార్లకు కొరత లేదు. అయితే ఎంత మంది ప్లేయర్లు ఉన్నా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. కానీ వీళ్లను మించినోడు ఒకడు భారత జట్టులో ఉన్నాడని ఆసీస్ మాజీ కోచ్ జస్టిస్ లాంగర్ అన్నాడు.
టీమిండియాలో స్టార్లకు కొరత లేదు. అయితే ఎంత మంది ప్లేయర్లు ఉన్నా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. కానీ వీళ్లను మించినోడు ఒకడు భారత జట్టులో ఉన్నాడని ఆసీస్ మాజీ కోచ్ జస్టిస్ లాంగర్ అన్నాడు.
Nidhan
ప్రస్తుత భారత జట్టులో తోపు ఎవరంటే అందరూ ఇద్దరి పేర్లే చెబుతారు. వాళ్లే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అందులో హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిస్తూనే, బ్యాట్‌తోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. మాజీ కెప్టెన్ అయిన విరాట్ ప్రస్తుత సారథి రోహిత్‌కు అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా ఉంటున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో టీమ్‌కు మూలస్తంభంలా నిలబడుతూ మ్యాచ్‌లు ఫినిష్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ లేని టీమిండియాను ఊహించుకోలేం. అంతగా భారత క్రికెట్‌పై రోకో (రోహిత్, కోహ్లీ) జోడీ తమ స్టాంప్ వేశారు. ఇండియన్ క్రికెట్లోనే కాదు.. ప్రస్తుత వరల్డ్ క్రికెట్లోనూ వీళ్లు టాప్ ప్లేయర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు. టీమిండియాతో మ్యాచ్ అంటే అపోజిషన్ టీమ్స్ వీళ్లిద్దర్నీ ఔట్ చేయడం పైనే ఫోకస్ చేస్తుంటాయి. అయితే ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం భారత జట్టులో మరో కీలక ఆటగాడు ఉన్నాడని అన్నాడు. రోహిత్, కోహ్లీల కంటే అతడే మోస్ట్ డేంజరస్ అని చెప్పాడు.
జస్టిన్ లాంగర్ చెప్పిన ఆ డేంజరస్ ప్లేయర్ మరెవరో కాదు.. కేఎల్ రాహుల్. ప్రస్తుతం టీమిండియాలో అందరికంటే రాహుల్ చాలా ప్రమాదకర ఆటగాడని లాంగర్ తెలిపాడు. ‘నేను ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్న సమయంలో భారత్‌తో సిరీస్ ఉంటే.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఔట్ అయ్యే వరకు రిలాక్స్ అయ్యేవాడ్ని కాదు. ఎందుకంటే రాహుల్ చాలా డేంజరస్ ప్లేయర్. అతడి ఆట చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. అతడికి ఇంటర్నేషనల్ లెవల్లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. గ్రౌండ్‌కు ఇరువైపులా అతడు ఆడగలడు. పేస్ అటాక్‌తో పాటు క్వాలిటీ స్పిన్నర్లను కూడా అంతే బాగా ఎదుర్కోగలడు’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. రాహుల్‌తో కలసి ఐపీఎల్లో వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాంటి ఆటగాడు టీమ్‌కు కెప్టెన్‌గా ఉండటం గొప్ప విషయమన్నాడు.
లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ తమ కొత్త హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మీద లాంగర్ పైవ్యాఖ్యలు చేశాడు. అతడితో కలసి పని చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. పేస్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌ను కూడా అంతే దీటుగా ఎదుర్కోవడం రాహుల్ స్ట్రెంగ్త్ అన్నాడు లాంగర్. ఇక, సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ కోసం రెడీ అవుతున్నాడు రాహుల్. ఆ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడీ స్టైలిష్ బ్యాట్స్‌మన్. కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్న వేళ.. పట్టుదలతో ఆడి టీమ్‌కు మంచి స్కోరు అందించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్‌లో అతడు ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి.. రాహుల్ డేంజరస్ బ్యాటర్ అంటూ లాంగర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: 2023లో టీమిండియా సాధించిన ఘనతలు.. ఎదుర్కొన్న అవమానాలు ఇవే!
LSG coach Justin Langer heaps praise on skipper KL Rahul. pic.twitter.com/IxCH1zeAOh
— CricTracker (@Cricketracker) December 31, 2023