రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో అందర్నీ భయపెడుతున్న బ్యాటర్ అతనే!

  • Author singhj Updated - 10:10 PM, Sat - 28 October 23

రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ కప్​లో ఒక బ్యాటర్ అందరు బౌలర్లను భయపెడుతున్నాడు. అతడు క్రీజులోకి వస్తే పరుగుల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే డేంజరస్​గా కనిపిస్తున్నాడా ప్లేయర్. అతడు ఎవరంటే..?

రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ కప్​లో ఒక బ్యాటర్ అందరు బౌలర్లను భయపెడుతున్నాడు. అతడు క్రీజులోకి వస్తే పరుగుల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే డేంజరస్​గా కనిపిస్తున్నాడా ప్లేయర్. అతడు ఎవరంటే..?

  • Author singhj Updated - 10:10 PM, Sat - 28 October 23

వన్డే వరల్డ్ కప్​-2023లో బ్యాట్స్​మెన్ హవా కొనసాగుతోంది. పరుగుల వరద పారిస్తున్నారు బ్యాటర్స్. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. మెగా టోర్నీలో దాదాపు ప్రతి టీమ్ నుంచి ఒకరిద్దరు బ్యాటర్లు సూపర్ ఫామ్​లో ఉన్నారు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్​లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్, విరాట్​లు భీకర ఫామ్​లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీపడి మరీ రన్స్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరి కంటే కూడా మరో బ్యాటర్ ఈ వరల్డ్ కప్​లో మోస్ట్ డేంజరస్​గా కనిపిస్తున్నాడు. అతడే సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.

ఈ ప్రపంచ కప్​లో డికాక్ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు కొట్టిన ఈ సౌతాఫ్రికా స్టార్.. ఈ వరల్డ్ కప్​లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్​గా ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. రీసెంట్​గా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లోనైతే ఏకంగా 174 రన్స్ బాదేశాడు డికాక్. ఈసారి మెగా టోర్నీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇంకో 9 పరుగులు చేస్తే అతడు మరో మైల్​స్టోన్​ను అందుకునేవాడు. వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్​గా ఉన్న ఎంఎస్ ధోని (183 నాటౌట్) రికార్డుకు చేరువయ్యేవాడు. బ్యాటింగ్​లో చెలరేగిపోతున్న డికాక్.. ఓవరాల్​గా ఈ వరల్డ్ కప్​లో ఆడిన ఐదు మ్యాచుల్లో 407 రన్స్​తో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్​గా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్​లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ల లిస్ట్​లో డికాక్ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ (354 రన్స్) ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (311) నాలుగో ప్లేస్​లో ఉన్నాడు. కోహ్లీ, రోహిత్​లు ఐదు మ్యాచుల్లో మూడొందల మార్క్​కు చేరుకోగా.. డికాక్ మాత్రం అన్నే మ్యాచ్​లు ఆడి నాలుగొందలకు పైగా రన్స్ చేశాడు. దీన్ని బట్టే అతడు ఎంత భీకరమైన ఫామ్​లో ఉన్నాడో చెప్పొచ్చు. మెగా టోర్నీలో ప్రస్తుతం రోహిత్, కోహ్లీ కంటే డికాక్ మోస్ట్ డేంజసర్​గా కనిపిస్తున్నాడు. ఇదే ఫామ్​ను అతడు కంటిన్యూ చేస్తే వరల్డ్ కప్స్​లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్​గా నిలిచే ఛాన్స్ ఉంది. అలాగే ఒకే ప్రపంచ కప్​లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ (7 సెంచరీలు) రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. డికాక్​ను దాటాలంటే నెక్స్ట్ ఆడబోయే మ్యాచుల్లో రోహిత్, విరాట్​లు మరింత రెచ్చిపోయి ఆడాల్సి ఉంటుంది. మరి.. డికాక్ బ్యాటింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాబర్​కు తలనొప్పిగా మారిన గిల్.. ఇండియన్స్​తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!

Show comments