Rohit Sharma, Virat Kohli: ఒక్కడి కోసం.. కోహ్లీ, రోహిత్‌లను బయటికి పంపిన BCCI?

Rohit Sharma, Virat Kohli: ఒక్కడి కోసం.. కోహ్లీ, రోహిత్‌లను బయటికి పంపిన BCCI?

Rohit Sharma, Virat Kohli, Retirement, Gautam Gambhir: భారత క్రికెట్‌లోకి ఓ వ్యక్తిని తీసుకొచ్చేందుకు.. ఇద్దరు స్టార్‌ క్రికెటర్లను బీసీసీఐ టీ20 టీమ్‌ నుంచి బయటికి పంపించిందనే కామెంట్ల వినిపిస్తున్నాయి.. వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Virat Kohli, Retirement, Gautam Gambhir: భారత క్రికెట్‌లోకి ఓ వ్యక్తిని తీసుకొచ్చేందుకు.. ఇద్దరు స్టార్‌ క్రికెటర్లను బీసీసీఐ టీ20 టీమ్‌ నుంచి బయటికి పంపించిందనే కామెంట్ల వినిపిస్తున్నాయి.. వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఛాంపియన్‌గా భారత్‌ అవతరించింది. శనివారం బార్బోడోస్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను టీమిండియా 7 పరుగుల తేడాతో ఓడించింది. చివరి ఓవర్‌ వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అంతమంగా రోహిత్‌ సేన విజేతగా నిలిచింది. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషంతో పాటే.. టీమిండియా క్రికెట్‌ అభిమానులు మరో విషయంలో బాధపడుతున్నారు. అదేంటంటే.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కప్పు గెలిచిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో భారత క్రికెట్‌ అభిమానులు కొంత బాధపడుతున్నారు. మళ్లీ ఈ ఇద్దరిని టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతూ చూడలేమా అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ పూర్తి ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక బీసీసీఐ బలవంతంగా ఇద్దర్ని రిటైర్‌ చేయించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇద్దరిలో కూడా మరికొంత కాలం టీ20 క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. దాన్ని ఎవరైనా ఒప్పుకోని తీరాల్సిందే. అయినా కూడా వరల్డ్‌ కప్‌ గెలిచిన వెంటనే రిటైర్మెంట్‌ ప్రకటించారు. అయితే.. కోహ్లీ, రోహిత్‌తో ఈ విషయంపై బీసీసీఐ ము​ందే మాట్లాడినట్లు కూడా ఒక విషయం తెలుస్తోంది. అదేంటంటే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌ రానున్నాడు.

ఆ కొత్త టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అని ఇప్పటికే బీసీసీఐలోని పెద్దలు కూడా హింట్లు ఇస్తున్నారు. దాదాపు అతనే హెడ్‌ కోచ్‌ అనే అంతా ఫిక్స్‌ అయిపోయారు కూడా. అయితే.. తాను టీమిండియా హెడ్‌ కోచ్‌గా రావాలంటే.. జట్టులో కొన్ని మార్పులు జరగాలని బీసీసీఐ గంభీర్‌ కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు టీమ్స్‌, కెప్టెన్సీ మార్పు.. ఇలా గంభీర్‌ కొన్ని కీలక మార్పులు సూచించాడు. అందుకే బీసీసీఐ కూడా ఒప్పుకుంది. అందులో భాగంగానే ఈ టీ20 వరల్డ్‌ కప్‌ మీ ఇద్దరికీ లాస్ట్‌ అని బీసీసీఐ ముందే రోహిత్‌, కోహ్లీకి చెప్పినట్లు సమాచారం. అందుకే గౌరవంగా ముందే రోహిత్‌, కోహ్లీ పక్కకు తప్పుకున్నారు. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ రాకతో.. టీమిండియా టీ20 టీమ్‌ నుంచి ఇద్దరు దిగ్గజాలు వెళ్లిపోవాల్సి వచ్చింది. రిటైర్మెంట్‌ అనేది ఎప్పటికైనా జరగాల్సిందే కానీ.. వారిద్దరి ఒక్కసారే మిస్‌ అవ్వడాన్ని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments