రోహిత్-కోహ్లీకి రెస్ట్ అవసరమా? ఆ ప్రాబ్లమ్ వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ: మాజీ క్రికెటర్

Sunil Gavaskar On Rohit And Kohli Absence: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీతో కలసి వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నారు.

Sunil Gavaskar On Rohit And Kohli Absence: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీతో కలసి వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీతో కలసి వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్​తో వచ్చే నెలలో టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత్. అప్పటివరకు ఇతర సిరీస్​లు లేకపోవడంతో రోకో జోడీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతర స్టార్లంతా త్వరలో మొదలయ్యే దులీప్ ట్రోఫీ-2024లో ఆడనున్నారు. కానీ రోహిత్, కోహ్లీతో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా మాత్రం ఈ టోర్నమెంట్​కు దూరంగా ఉంటున్నారు. సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉండటంతో ఈ ముగ్గురు స్టార్లను దులీప్ ట్రోఫీలో ఆడించడం లేదు బీసీసీఐ. గాయాలపాలైతే ఇబ్బంది కాబట్టి ఎందుకైనా మంచిదని వాళ్లకు రెస్ట్​ను పొడిగించింది. అయితే బోర్డు తీరును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.

రోహిత్-కోహ్లీకి రెస్ట్ అవసరమా? అని ప్రశ్నించాడు గవాస్కర్. వాళ్లకు విశ్రాంతిని పొడిగిస్తే వచ్చే ఇబ్బందులకు ఎవరు బాధ్యులు అని క్వశ్చన్ చేశాడు. దులీప్ ట్రోఫీ జట్టులోకి వీళ్లను ఎందుకు ఎంపిక చేయలేదని సెలెక్టర్లను ప్రశ్నించాడు గవాస్కర్. పేస్ బౌలర్ కాబట్టి బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారంటే అర్థం ఉందని, ఎందుకంటే అతడికి గాయాల బెడద పొంచి ఉందన్నాడు. అయితే బ్యాటర్లకు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటన్నాడు. 35 ఏళ్లు దాటిన ఏ ప్లేయర్ అయినా ఫిట్​నెస్​ మీద మరింత ఫోకస్ చేయడం అవసరమన్నాడు గవాస్కర్. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగితే కండరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. రోకో జోడీని వీలైనన్ని ఎక్కువ మ్యాచ్​లు ఆడిస్తేనే మంచిదని సూచించాడు.

రోహిత్-కోహ్లీని ఫిట్​గా ఉంచాలనే ఉద్దేశంతో ఎక్కువ రెస్ట్ ఇవ్వడం సరికాదన్నాడు గవాస్కర్. ఎంత రెస్ట్ ఇస్తే అంత ప్రాబ్లమ్ అన్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆడితే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని.. కాబట్టి వాళ్లను ఆటకు దగ్గరగా ఉంచితే మంచిదన్నాడు. ఇక, పొట్టి ప్రపంచ కప్ తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని శ్రీలంకతో వన్డే సిరీస్​ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు రోకో జోడీ. 37 ఏళ్ల హిట్​మ్యాన్ ఈ సిరీస్​లో 58, 64, 35 రన్స్ చేశాడు. 35 ఏళ్ల కోహ్లీ మాత్రం నిరాశపర్చాడు. మొత్తం మీద 58 పరుగులు మాత్రమే చేశాడు. వీళ్లను మళ్లీ యాక్షన్​లో చూడాలంటే సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆగాల్సిందే. ఆ రోజు బంగ్లాదేశ్​తో జరిగే టెస్ట్ సిరీస్​లో రోహిత్-విరాట్ గ్రౌండ్​లోకి దిగనున్నారు. మరి.. గవాస్కర్ చెప్పినట్లు రోకో జోడీని దులీప్ ట్రోఫీలో ఆడించడం బెటరా? లేదా రెస్ట్​ ఇవ్వడం మంచిదా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments