Rohit Sharma: వీడియో: ముఖ్యమంత్రిని కలిసిన రోహిత్‌ శర్మ! చేతులు కట్టుకుని..

Rohit Sharma, T20 World Cup 2024, CM Eknath Shinde, Maharashtra: దేశానికి టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ముఖ్యమంత్రిని కలిశాడు. వారి భేటికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో రోహిత్‌ చేతులు కట్టుకుని కూర్చున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rohit Sharma, T20 World Cup 2024, CM Eknath Shinde, Maharashtra: దేశానికి టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ముఖ్యమంత్రిని కలిశాడు. వారి భేటికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో రోహిత్‌ చేతులు కట్టుకుని కూర్చున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భారత్‌కు రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మను గత వారం రోజులుగా దేశం మొత్తం అభినందిస్తూనే ఉంది. క్రికెట్‌ అభిమానులంతా ఇంకా విన్నింగ్‌ మూడ్‌లోనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా దేశానికి కప్పుతో తిరిగి వచ్చిన రోహిత్‌ సేనకు అదిరిపోయే వెల్‌కమ్‌ లభించింది. అయితే.. తాజాగా వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సందర్భంగా రోహిత్‌ శర్మతో పాటు మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు ప్లేయర్లను అభినందించేందుకు ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు శుక్రవారం సీఎంని కలిశారు భారత క్రికెటర్లు.

రోహిత్‌ శర్మతో పాటు.. ముంబైకి చెందిన క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వీరు నలుగురు ముంబైకి చెందిన ప్లేయర్లు కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రత్యేకంగా వారిని పిలిపించి.. అభినందించి.. సన్మానించారు. అయితే.. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ వినయంగా కూర్చున్న విధానంపై క్రికెట్‌ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

ముఖ్యమంత్రి ముందు రోహిత్ శర్మ చేతులు కట్టుకుని కూర్చోవడం బాగాలేదని అంటున్నారు. చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు.. నార్మల్‌గానే రోహిత్‌ అలా కూర్చున్నాడని అందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏం లేదంటూ మరికొంత మంది కౌంటర్‌ ఇస్తారు. అయితే.. సీఎం పక్కన రోహిత్‌ కూర్చోగా.. మరో సోఫాలో సూర్య, దూబే, జైస్వాల్‌ కూర్చున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ అనుభవాలను, అనుభూతిని సీఎంతో పంచుకున్నారు భారత ఆటగాళ్లు. మరి సీఎం ఏక్‌నాథ్‌ షిండేను రోహిత్‌ శర్మ కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments