iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రితిక జోలికి వస్తే ఊరుకోను.. రోహిత్​కు వార్నింగ్ ఇచ్చిన యువీ!

  • Published Dec 14, 2023 | 7:02 PM Updated Updated Dec 14, 2023 | 7:02 PM

భారత కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే గురించి తెలిసిందే. అయితే ఆమె కోసం హిట్​మ్యాన్​కు మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ వార్నింగ్ ఇచ్చాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే గురించి తెలిసిందే. అయితే ఆమె కోసం హిట్​మ్యాన్​కు మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ వార్నింగ్ ఇచ్చాడు.

  • Published Dec 14, 2023 | 7:02 PMUpdated Dec 14, 2023 | 7:02 PM
Rohit Sharma: రితిక జోలికి వస్తే ఊరుకోను.. రోహిత్​కు వార్నింగ్ ఇచ్చిన యువీ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యారేజ్​ చేసుకొని 8 ఏళ్లు పూర్తయ్యాయి. రితిక సజ్దేతో అతడి వివాహ బంధం విజయవంతంగా మరో ఏడాదిని పూర్తి చేసుకుంది. దీంతో ఈ అన్యోన్యమైన జంట ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇద్దరూ కలసి దిగిన పలు ఫొటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఏటికేడు వీళ్ల బంధం మరింత బలపడుతోంది. దీంతో రోహిత్-రితిక జోడీ కపుల్ గోల్స్ సెట్ చేస్తోంది. అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. అందులో టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర ఉందని.. రితిక కోసం రోహిత్​కు యువరాజ్ వార్నింగ్ ఇవ్వడం గురించి చాలా మందికి తెలియదు. అవును, ఇది నిజమే. రితికా సజ్దే కోసం సహచర క్రికెటర్ హిట్​మ్యాన్​ను యువీ ఓసారి హెచ్చరించాడు.

యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ కలసి 2008లో ఓ కమర్షియల్ యాడ్​కు సంబంధించిన షూటింగ్​లో పాల్గొన్నారు. ఆ అడ్వర్టయిజ్​మెంట్​ షూట్​కు రితికా సజ్దే మేనేజర్ కావడం గమనార్హం. అయితే అప్పటికే రితికాతో యువీకి పరిచయం ఉంది. వాళ్లిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. రితికాను యువరాజ్ సొంత చెల్లెలిలా భావించేవాడట. ఇప్పటికి కూడా ఆమె యువీకి రాఖీ సిస్టరే. అందుకే ఆ యాడ్ షూటింగ్​కు రోహిత్ రాగానే అతడికి ముందుగానే హెచ్చరిక జారీ చేశాడట యువీ. రితికా వైపు చూపిస్తూ.. తనో స్పోర్ట్స్ మేనేజర్ అని, ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హిట్​మ్యాన్​కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. దీంతో రోహిత్ షాకయ్యాడట. ఆమెతో తనకేమీ పని లేదని.. తాను వచ్చింది కేవలం షూటింగ్​లో పాల్గొనడానికేనని హిట్​మ్యాన్ గట్టిగానే బదులిచ్చాడట.

యువీతో ఆ ఇన్సిడెంట్ తర్వాత మరో షూట్​లో రోహిత్-రితిక కలిశారట. అయితే ఫస్ట్ టైమ్ ఆమెను కలసినప్పుడు పెద్దగా పట్టించుకోని హిట్​మ్యాన్.. సెకండ్ టైమ్ మాత్రం ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడట. మైక్రోఫోన్​తో కలిగిన అసౌకర్యంతో ఇబ్బంది పడుతున్న తనతో ఆమె రియాక్ట్ అయిన తీరుకు ఇంప్రెస్ అయ్యాడట. రితిక వ్యక్తిత్వాన్ని రోహిత్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. అలా వాళిద్దరి మధ్య మాటలు కలవడం, అది స్నేహంగా మారి హిట్​మ్యాన్​కు స్పోర్ట్స్ మేనేజర్​గా పనిచేయడం స్టార్ట్ చేసింది రితిక. ప్రొఫెషనల్​గా దగ్గరైన రితికకు రోహిత్ ప్రాణస్నేహితుడిగా మారిపోయాడు. అలా ఒక రోజు బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్​కు ఆమెను తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో ఆరేళ్ల పరిచయం పెళ్లి పీటల దాకా వెళ్లింది. 2015, జూన్ 3న వీళ్ల ఎంగేజ్​మెంట్ అయింది. అదే ఏడాది డిసెంబర్ 13న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్​లో రోహిత్-రితిక మ్యారేజ్ గ్రాండ్​గా జరిగింది.

ఇదీ చదవండి: షారూక్ ఖాన్ స్వభావం అలా ఉండేది! నేను ఆశ్చర్యపోయా: గంభీర్