Nidhan
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది ఏదీ కలసి రావడం లేదు. కెరీర్లో ఒక్కసారైనా వరల్డ్ కప్‌ను ముద్దాడాలని అనుకుంటే అది తృటిలో చేజారింది. వన్డే ప్రపంచ కప్-2023 టోర్నమెంట్లో ఫైనల్ వరకు ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన భారత జట్టు.. తీరా తుదిపోరులో ఓడి కప్‌ను మిస్ చేసుకుంది. ఓటమి బాధ మిగతా ప్లేయర్లు, అభిమానుల కంటే కూడా హిట్‌మ్యాన్‌కు మిగిల్చిన గాయం అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లు పడిన శ్రమ అంతా బూడిద పాలవ్వడంతో రోహిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, బ్రిలియంట్ కెప్టెన్సీతో టీమ్‌ను సూపర్బ్‌గా నడిపించినా ఫైనల్ ఓటమితో అంతా వృథా అయిపోయింది. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ విధ్వంసకర బ్యాటర్‌కు ముంబై ఇండియన్స్ ఊహించని షాక్ ఇచ్చింది. తమ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది.
రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది ముంబై. అసలే వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హిట్‌మ్యాన్‌ను ఇది మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోహిత్లో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. తన కూతురు సమైరా చదువుకుంటున్న ధీరూబాయ్ అంబానీ స్కూల్ యానువల్ ఫంక్షన్‌కు భార్య రితికా సజ్దేతో కలసి అటెండ్ అయ్యాడు హిట్‌మ్యాన్. అయితే ఇటు రోహిత్ ఫేస్‌లో గానీ అటు రితికా ముఖంలో గానీ సంతోషం లేదు. ఇద్దరూ చాలా బాధలో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్నవారిని నవ్వించే హిట్‌మ్యాన్ ఇలా కనిపించేసరికి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అతడు ఈ బాధలో నుంచి త్వరగా బయటపడి.. మునుపటిలా హుషారుగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్కూల్ కార్యక్రమానికి వచ్చిన రోహిత్‌ను చూస్తే ముంబై ఇచ్చిన షాక్ నుంచి అతడు కోలుకున్నట్లుగా కనిపించడం లేదు.
ఇన్నాళ్లూ ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సేవలు అందించినా.. ఐదు ట్రోఫీలు అందించినా, ఎంతో లాయల్‌గా ఉన్నా తన విషయంలో ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరు రోహిత్‌ను తీవ్రంగా బాధించింది. అందుకే కెమెరా ముందుకు వచ్చినా అతడి ముఖంలో చిరునవ్వే లేదు. హిట్‌మ్యాన్‌తో పాటు అతడి భార్య రితికా సజ్దే కూడా శాడ్‌గా కనిపించింది. దీన్ని బట్టే రోహిత్ ఫ్యామిలీని కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని చెప్పొచ్చు. కాగా, రోహిత్ గురించి చెబుతూ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిన ఓ పోస్టుకు రితికా ఎల్లో కలర్లోని లవ్ సింబల్‌ను కామెంట్‌గా పెట్టింది. దీంతో అతడు చెన్నైలోకి వెళ్తున్నాడని ఆమె హింట్ ఇచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ముంబై కెప్టెన్సీ మార్పు నిర్ణయం అటు అభిమానులతో పాటు ఇటు రోహిత్ శర్మను కూడా పర్సనల్‌గా బాగా హర్ట్ చేసింది. దీని నుంచి అతడు ఎప్పుడు బయటపడతాడో చూడాలి. మరి.. రోహిత్‌ను బాధపెడుతూ ముంబై తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్- హార్దిక్ మధ్య గొడవలు! అంతా పాండ్యా స్కెచ్ ప్రకారమే!
Rohit Sharma and his wife Ritika Sajdeh at Samaira’s annual function 🥹#RohitSharma #RitikaSajdeh #Samaira #CricketTwitter pic.twitter.com/dC8VpFPe0G
— InsideSport (@InsideSportIND) December 17, 2023