గంభీర్​తో ఏమైనా గొడవలు ఉన్నాయా? రోహిత్ అదిరిపోయే రిప్లయ్!

Rohit Sharma On Gautam Gambhir's Coaching Style: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.

Rohit Sharma On Gautam Gambhir's Coaching Style: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా భారత నయా కోచ్ గౌతం గంభీర్ గురించి హిట్​మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం నుంచి భారత్-బంగ్లాదేశ్​ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియానికి ఐద్రోజుల కిందే చేరుకున్న మెన్ ఇన్ బ్లూ జోరుగా సాధన చేస్తోంది. ఫస్ట్ టెస్ట్​కు టైమ్ దగ్గర పడటంతో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రోహిత్ గంభీర్​తో పాటు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీతో గొడవలు ఉన్నాయా? అనే ప్రశ్నకు అతడు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అసలు రోహిత్ ఏమన్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త కోచ్ గంభీర్​తో ఎలాంటి గొడవలు లేవన్నాడు రోహిత్. కానీ అతడి కోచింగ్ స్టైల్ మాత్రం డిఫరెంట్​గా ఉందన్నాడు. అతడి రాకతో టీమ్ డైనమిక్స్ మారిపోయాయన్నాడు. టీమ్​కు సంబంధించి ప్రతిదీ అర్థం చేసుకోవడం ముఖ్యమని.. తమ మధ్య మంచి అండర్​స్టాండింగ్ ఉందన్నాడు హిట్​మ్యాన్. గంభీర్​తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్​ గురించి తనకు బాగా తెలుసునని చెప్పాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్​ను ఎన్నో మ్యాచుల్లో ఎదుర్కొన్నానని చెప్పిన భారత కెప్టెన్.. అతడు చాలా టఫ్ బౌలర్ అని మెచ్చుకున్నాడు. మరో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్​తో ఎక్కువగా కలసి ఆడే అవకాశం రాలేదన్నాడు. అతడితో పని చేస్తుంటే మంచిగా అనిపిస్తోందన్నాడు. కొత్త కోచింగ్ స్టాఫ్​తో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న రోహిత్.. కానీ వాళ్ల స్టైల్​కు అలవాటు పడేందుకు టైమ్ తీసుకుంటున్నామని చెప్పాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలోని పాత కోచింగ్ స్టాఫ్​తో పోల్చుకుంటే వీళ్లు చాలా డిఫరెంట్ అని తెలిపాడు.

శ్రీలంక సిరీస్​తో జట్టు గురించి, ఆటగాళ్ల గురించి కొత్త కోచింగ్ స్టాఫ్​ పూర్తిగా తెలుసుకున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీమ్​కు సంబంధించిన విషయాలను వాళ్లు త్వరగా గ్రహిస్తూ, నేర్చుకుంటున్నారని తెలిపాడు. వాళ్లకో డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఉందన్నాడు. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో ఎంతో మంది కోచ్​లతో పని చేశానని.. ప్రతి ఒక్కరికీ ఒక యూనిక్ స్టైల్ ఉంటుందన్నాడు హిట్​మ్యాన్. కోచింగ్ స్టాఫ్​కు తగ్గట్లు ఆటగాళ్లు కూడా మారాలని, వాళ్ల స్టైల్​ను అర్థం చేసుకొని ఛేంజెస్​కు అలవాటు పడాలన్నాడు. తాము ప్రతి మ్యాచ్​ను, ప్రతి సిరీస్​ను అంతే కీలకంగా భావిస్తామని.. దేన్నీ లైట్ తీసుకోబోమన్నాడు. గెలుపే లక్ష్యంగా తన మైండ్ పని చేస్తుందన్నాడు రోహిత్. ఎలా గెలవాలి? నెగ్గేందుకు ఏమేం చేయగలం? అనే విషయాల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతుంటాయన్నాడు.

Show comments