iDreamPost
android-app
ios-app

శార్ధూల్ ఠాకూర్ ను తిట్టిన రోహిత్ శర్మ! సీరియస్ లుక్ తో..

  • Author Soma Sekhar Published - 04:40 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 04:40 PM, Fri - 28 July 23
శార్ధూల్ ఠాకూర్ ను తిట్టిన రోహిత్ శర్మ! సీరియస్ లుక్ తో..

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ సాధించిన విజయం కంటే ఎక్కువగా ఆటలో జరిగిన సంఘటనలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుటో ఒకటి టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ కాగా.. ఇంకోటి కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఆటగాడు అయిన శార్దూల్ ఠాకూర్ ను తిట్టడం. ఈ మ్యాచ్ లో ఒకానొక సందర్బంలో సహనం కోల్పోయిన రోహిత్ తన నోటికి పనిచెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఆ వీడియోను ట్విట్టర్ నుంచి తొలగించారు. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్ గా మారింది.

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపడంతో.. విండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టగా, జడేజా 3 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను కట్టడి చేశారు విండీస్ బౌలర్లు. దాంతో 115 పరుగుల లక్ష్యానికే 5 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఫామ్ లేక విమర్శలపాలవుతున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో సత్తా చాటాడు.

ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. తన సహచర ఆటగాడు అయిన శార్దూల్ ఠాకూర్ ను తిట్టాడు. ఫీల్డింగ్ లో ఠాకూర్ బద్దకంగా ఉండటంతో.. రోహిత్ సీరియస్ అయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్ లో విండీస్ బ్యాటర్ షాయ్ హోప్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బ్యాట్ కు బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బాల్ బౌండరీ వెళ్లలేకపోయింది. అయితే కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ బాల్ పట్టుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. ఈలోపు విండీస్ ఆటగాళ్లు 3 పరుగులు పూర్తి చేశారు.

దీంతో ఫీల్డింగ్ లో బద్దకంగా వ్యవహరించిన శార్ధూల్ ను తిట్టాడు రోహిత్ శర్మ. అతడి వైపు సీరియస్ లుక్ ఇస్తూ.. ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఆ వీడియోను సంబంధిత ఖాతాదారుడు డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా.. రోహిత్ ఫీల్డర్లపై సీరియస్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో దినేష్ కార్తీక్ పై ఇతర ఆటగాళ్లపై కూడా సీరియస్ అయ్యి బూతులు తిట్టిన సందర్బాలు కూడా ఉన్నాయి.