Nidhan
Team India: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇంకొందరు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
Team India: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇంకొందరు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
Nidhan
టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్‌లు లేవు. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్‌లో బిజీగా ఉన్నారు. భార్య, పిల్లలతో కలసి టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లోని అందమైన ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు. ఇంకొందరు ప్లేయర్లు ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, శ్రీలంక టూర్లో ఆడి సీనియర్ క్రికెటర్లు అలసిపోయారు. జూనియర్లది కూడా ఇదే పరిస్థితి. అందుకే మధ్యలో భారీ గ్యాప్ వచ్చేలా ముందే బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత్ తన తదుపరి సిరీస్‌ను సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇంకా దీనికి నెలకు పైనే సమయం ఉంది. అయితే ఈ మధ్యలో బోర్డు ఆటగాళ్లను ఒక టోర్నీ బరిలోకి దింపుతోంది.
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇష్యూ కారణంగా నేషనల్ డ్యూటీ లేని సమయంలో ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ భారత బోర్డు ఆ మధ్య రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్‌ను బోర్డు ఆదేశించింది. వీళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా ఈ టోర్నీలో ఆడించాలని అనుకుంటోంది బోర్డు. ఆల్రెడీ వాళ్లకు ఇండికేషన్స్ ఇచ్చిందట. దులీప్ ట్రోఫీ బరిలోకి రోకో జోడీ దిగడమే ఆలస్యమని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే 8 ఏళ్లుగా ఈ టోర్నీతో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్‌ను కొత్త కోచ్ గంభీర్-బోర్డు కలసి ఎలా ఒప్పించాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
రోహిత్, కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఎప్పుడో మానేశారు. చివరగా దులీప్ ట్రోఫీ-2016లో హిట్‌మ్యాన్ పాల్గొనగా.. కింగ్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడి దశాబ్ద కాలం దాటింది. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లు, మరోవైపు ఐపీఎల్‌తో బిజీగా ఉండే ఈ స్టార్లు.. మధ్యలో ఫామ్ కోల్పోయిన టైమ్‌లో డొమెస్టిక్ సైడ్ రమ్మని కోరినా రాలేదు. అలాంటి దిగ్గజాలను దులీప్ ట్రోఫీలో ఆడేలా అంత ఈజీగా గంభీర్ ఎలా ఒప్పించాడని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఫామ్‌ను మెరుగుపర్చుకోవడం, ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకం కావడం, ఇకపై టెస్టుల్లోనే ఎక్కువగా ఆడాల్సి ఉండటంతో దులీప్ ట్రోఫీలో ఆడాలంటూ గంభీర్ చేసిన సూచనను రోహిత్-కోహ్లీ కాదనలేకపోయారని తెలుస్తోంది. గౌతీతో పాటు బోర్డు పెద్దలు కూడా ఈ లెజెండ్స్‌ను కన్విన్స్ చేశారని సమాచారం. ఇంటర్నేషనల్ డ్యూటీ లేని టైమ్‌లో డొమెస్టిక్‌లో ఆడాలనే రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ అయింది బోర్డు. రోహిత్, కోహ్లీ నుంచే ఈ రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఈ విధంగా ప్లాన్ చేశారని వినిపిస్తోంది.