బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ ఆసక్తికరమైన దృశ్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో గ్రౌండ్ లోకి రాకెట్ మెన్ వచ్చి అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ ఆసక్తికరమైన దృశ్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో గ్రౌండ్ లోకి రాకెట్ మెన్ వచ్చి అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఎన్నో వింతలు, విశేషాల మనకు కనిపిస్తూ ఉంటాయి. గ్రౌండ్ లోకి కుక్కలు, పాములు, పిల్లులు వచ్చి ఆటకు ఆటంకం కలిగించి.. ప్రేక్షకులను సరదాగా నవ్విస్తాయి. కానీ ఇప్పటి వరకు మీరు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మధ్యలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూసుండరు. బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ ఆసక్తికరమైన దృశ్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో గ్రౌండ్ లోకి రాకెట్ మెన్ వచ్చి అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ లో బ్రిస్బేన్ హీట్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఇది మీరింతవరకు చూసుండరు. ఇంతకీ ఏం జరిగిందంటే? బ్రిస్బేన్ వర్సెస్ మెల్బోర్న్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆట మధ్యలో బ్రేక్ రావడంతో.. ప్రేక్షకులను అలరించడానికి గ్రౌండ్ యాజమాన్యం రాకెట్ మెన్ ను రంగంలోకి దించింది. ఈ విరామ సమయంలో రాకెట్ మెన్ గ్రౌండ్ లో చక్కర్లు కొట్టాడు. లేజర్ లైట్ల కాంతుల్లో గ్రౌండ్ నలుమూలల గిర్రున తిరిగి వచ్చాడు. మైదానంలో ఉన్న క్రికెట్ ప్రేమికులు ఇది ఊహించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రారంభ మ్యాచ్ కావడంతో.. టోర్ని నిర్వాహకులు ఈ ఏర్పాటు చేశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో కొలిన్ మున్నో 61 బంతుల్లో 9 ఫోర్లు,5 భారీ సిక్సర్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అనంతరం 215 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ జట్టు 15.1 ఓవర్లలో కేవలం 111 పరుగులుకే ఆలౌట్ అయ్యి.. 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో కార్ట్ వ్రైట్ 33 పరుగులుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రిస్బేన్ బౌలర్లలో స్వీప్సన్ 3 వికట్లతో రాణించాడు. మరి మ్యాచ్ మధ్యలో రాకెట్ మెన్ రావడం మీకేవిధంగా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dream for Indians 🇮🇳 to do such a show in #IPL 😜😂 #IPLRetentionspic.twitter.com/yq1XZVoWTQ
— Aamir Mumtaz🌟👑💙 (@thisisaamiir) December 7, 2023