SNP
SNP
టీమిండియా మాజీ క్రికెటర్, మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప తన విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 36 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సులతో దుమ్మురేపాడు. ఊతప్ప ఊర మాస్ బ్యాటింగ్‌కి కేప్ టౌన్ సాంప్ ఆర్మీ కుదేలైపోయింది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం కేప్ టౌన్ సాంప్ ఆర్మీ-హరారే హరికేన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఊతప్ప విధ్వంసం సృష్టించాడు. దాదాపు 244.44 భారీ స్ట్రైక్‌రేట్‌తో కేప్‌టౌన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హరారే హరికేన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహిరిస్తున్న ఊతప్ప ఆ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత కేప్ టౌన్ సాంప్ ఆర్మీ బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ సైతం సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 62 పరుగులతో దుమ్మురేపాడు. మరో ఓపెనర్ రాజపక్సా 11 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మరుమణి డకౌట్ అయి నిరాశపరిచాడు. చివర్లో కరిమ్ జనత్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 24 పరుగులు, సియన్ విలియమ్సన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులతో వేగంగా ఆడటంతో కేప్‌టౌన్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరికేన్స్ బౌలర్లలో బర్గర్ 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. నబి ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ఈ మ్యాచ్‌లో వికెట్లేమీ తీసుకోలేదు. పైగా రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని ఎక్స్‌పెన్సీవ్‌గా మారాడు.
ఇక 146 పరగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హరికేన్స్‌కు ఊతప్ప సునామీ ఇన్నింగ్స్ విజయం తెచ్చిపెట్టింది. కేవలం 9.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి హరికేన్స్ విజయం సాధించింది. కెప్టెన్ ఊతప్ప 36 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 88 పరుగులు చేసి అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 6 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన డోనవాన్ ఫెరీరా 16 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 35 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఊతప్పకు మంచి తోడుగా నిలిచాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండానే జట్టును విజయతీరాలకు చేర్చారు. కేప్‌టౌన్ బౌలర్లలో రిచర్డ్ నగరవా ఒక్కడే ఒక వికెట్ తీసుకున్నాడు. ఎలిమినేటర్‌లో గెలిచి.. వెంటనే అదే రోజు క్వాలిఫైయర్-2 ఆడిన ఊతప్ప కెప్టెన్సీలోని హరారె హరికేన్స్ ఓటమి పాలైంది. ఖలందర్స్ టీమ్‌తో జరిగిన శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ ఓడింది. మరి ఎలిమినేటర్‌లో ఊతప్ప ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ROBIN UTHAPPA, THE STAR OF HARARE.
88* runs from just 36 balls including 8 fours & 6 sixes in the Eliminator of Zim Afro T10. pic.twitter.com/AJOI0MUPlg
— Johns. (@CricCrazyJohns) July 28, 2023
ఇదీ చదవండి: 14 బంతుల్లో 61 పరుగులు! పాక్ బౌలర్‌కు చుక్కలు చూపించిన యూసుఫ్ పఠాన్