iDreamPost
android-app
ios-app

ఆ పసికూన చేతిలో  కూడా పాకిస్థాన్ ఓడిపోద్ది: ఇండియన్ స్టార్ క్రికెటర్!

  • Published May 31, 2024 | 9:11 PM Updated Updated May 31, 2024 | 9:11 PM

ICC T20 World Cup Pakistan Performance: వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన అత్యంచ ఘోరంగా ఉంటుందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ జోస్యం చెప్పాడు. ఆఖరికి ఐర్లాండ్ జట్టు చేతిలో కూడా ఆ టీమ్ ఓడిపోతుందని చెప్పుకొచ్చాడు. ీీ

ICC T20 World Cup Pakistan Performance: వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన అత్యంచ ఘోరంగా ఉంటుందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ జోస్యం చెప్పాడు. ఆఖరికి ఐర్లాండ్ జట్టు చేతిలో కూడా ఆ టీమ్ ఓడిపోతుందని చెప్పుకొచ్చాడు. ీీ

  • Published May 31, 2024 | 9:11 PMUpdated May 31, 2024 | 9:11 PM
ఆ పసికూన చేతిలో  కూడా పాకిస్థాన్ ఓడిపోద్ది: ఇండియన్ స్టార్ క్రికెటర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వతా ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గురించే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జట్లు ఒక్కొక్కటిగా అమెరికా చేరుకుంటున్నాయి. చేరుకోవడమే కాకుండా.. క్యాంపుల్లో తీవ్రంగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. ఈసారి ప్రతి జట్టు మేమంటే మేము కప్పు కొట్టేది అని దీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. అయితే ఆ జట్టు ఎప్పుడూ పేరు గొప్ప ఊరు దిబ్బ అని అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మంచి సెటైరిక్ వేలో చెప్పుకొచ్చాడు. అదేంటంటే.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్ చేతిలో కూడా ఓడిపోతుంది అని జోస్యం చెప్పాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లనుంది. ఇటీవలే వరల్డ్ కప్ రెడీనెస్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఇంగ్లాడ్ జట్టుతో 4 మ్యాచుల వన్డే సిరీస్ లో పాల్గొంది. అక్కడే వారికి తీరని పరాభవం ఎదురైంది. 4 మ్యాచుల్లో కేవలం 2 మాత్రమే జరిగాయి. 2 మ్యాచులు వర్షార్పణం అయ్యాయి. ఆ రెండు మ్యాచుల్లో 2-0 తేడాతో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. ఇలాంటి తరుణంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ రాబిన్ ఊతప్ప చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లో ఐర్లాండ్ జట్టు చేతిలో కూడా ఓటమి పాలవుతుందని చెప్పుకొచ్చాడు.

ఏ ఏడాది వరల్డ్ కప్ గ్రూప్ ఏలో పాకిస్తాన్, టీమిండియా, కెనడా, అమెరికా, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ తరుణంలో జూన్ 6న పాక్ జట్టు అమెరికాతో, జూన్ 9న భారత్, ఆ తర్వాత కెనడా, జూన్ 16న ఐర్లాండ్ టీమ్స్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాబిన్ ఊతప్ప పాక్ ప్రదర్శనపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నమెంట్ లో చిన్న చిన్న జట్లతో కూడా ఓడిపోయే టీమ్ ఏదైనా ఉంది అంటే.. ఆ లిస్టులో పాకిస్తాన్ జట్టు ఉంటుందని చెప్పాడు. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్ టీమ్ చేతిలో కూడా ఓడిపోతుంది అంటూ రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పడమే కాదు.. పాక్ పరువు తీసేసశాడు.

ఎందుకంటే పాకిస్తాన్ జట్టు బ్యాటుతోనే కాదు.. బాల్ తో కూడా ప్రదర్శన చేస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఊతప్పే కాదు.. చాలామంది క్రికెట్ దిగ్గజాలు అదే అభిప్రాయపడుతున్నారు. అలాగే ఐర్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయద్దని ఊతప్ప సూచించాడు. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా కచ్చితంగా ఐర్లాండ్ కు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. పైగా పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ రోజు రోజుకు దిగజారుతోందని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లో కూడా అదే చూశాం. అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయింది అన్నాడు. పైగా కీలక మ్యాచుల్లో పాక్ జట్టు ఓటమి పాలవుతుందని చెప్పాడు. పాక్ ప్రదర్శనపై రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş