తొలి వన్డేలోనే సత్తా చాటిన రియాన్‌ పరాగ్‌! మరో యువీ అవుతాడా?

తొలి వన్డేలోనే సత్తా చాటిన రియాన్‌ పరాగ్‌! మరో యువీ అవుతాడా?

Riyan Parag, IND vs SL, Avishka Fernando: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేతో అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్‌ పరాగ్‌.. తొలి వన్డేలో అద్భుతం చేశాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Riyan Parag, IND vs SL, Avishka Fernando: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేతో అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్‌ పరాగ్‌.. తొలి వన్డేలో అద్భుతం చేశాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

భారత్‌ శ్రీలంక మధ్య కొలంబో వేదికగా మూడో వన్డే హోరీహోరీగా సాగుతోంది. తొలుత లంక జట్టు బ్యాటింగ్‌తో టీమిండియాను డామినేట్‌ చేయగా.. తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు లంకను ఊహించిన స్కోర్‌ కంటే చాలా తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. అయితే.. బ్యాటింగ్‌లో రెచ్చిపోతున్న శ్రీలంక ముక్కుతాడేసింది మాత్రం యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగే. 35 ఓవర్ల తర్వాత.. కేవలొ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి.. 170 పరుగులు చేసిన లంక భారీ దిశగా సాగింది.

కానీ, 36వ ఓవర్‌ వేసిన రియాన్‌ పరాగ్‌.. 96 పరుగులతో సెంచరీకి దగ్గరైన అవిష్క ఫెర్నాండోను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత తన నెక్ట్స్‌ ఓవర్‌లో లంక కెప్టెన్‌ చరిత్‌ అసలంకాను అవుట్‌ చేసి.. లంక స్పీడ్‌కు బ్రేకులు వేశాడు. అలాగే ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో దునిత్‌ వెల్లలాగేను అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేసి పెవిలియన్‌ చేర్చాడు. విశేషం ఏంటంటే.. ఈ మ్యాచ్‌ రియాన్‌ పరాగ్‌కు తొలి వన్డే. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పరాగ్‌. విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా వన్డే క్యాప్‌ అందుకున్న పరాగ్‌ తొలి వన్డేలోనే మూడు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు తీసుకున్నాడు.

అయితే.. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో పరాగ్‌ ప్రదర్శన చూసిన తర్వాత.. చాలా మంది టీమిండియాకు మరో యువరాజ్‌ సింగ్‌ దొరికాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. జట్టులో ఒక నిఖార్సయిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ లేక పెద్ద లోటుగా ఉంది. యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌ అయినప్పటి నుంచి ఆ ప్లేస్‌ అలాగే ఖాళీగా ఉంది. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నా.. వాళ్లు బ్యాటింగ్‌లో యువీ స్థాయిని అందుకోలేకపోయారు. అయితే.. ఇప్పుడు భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం రియాన్‌ పరాగ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. బ్యాటింగ్‌ ఎలాగో బాగా చేసే రియాన్‌.. బౌలింగ్‌లో రాణిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments