IND vs ZIM: జింబాబ్వే టూర్.. పాస్ పోర్ట్ పోగొట్టుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్!

జింబాబ్వే టూర్ కు బయలుదేరిన భారత స్టార్ ప్లేయర్ కు ఓ సమస్య ఎదురైంది. తన పాస్ పోర్ట్, మెుబైల్ ఫోన్ ను ఎయిర్ పోర్ట్ లో పొగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

జింబాబ్వే టూర్ కు బయలుదేరిన భారత స్టార్ ప్లేయర్ కు ఓ సమస్య ఎదురైంది. తన పాస్ పోర్ట్, మెుబైల్ ఫోన్ ను ఎయిర్ పోర్ట్ లో పొగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయలుదేరింది. యంగ్ టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ టూర్ కు బయలుదేరిన భారత స్టార్ ప్లేయర్ కు ఓ సమస్య ఎదురైంది. తన పాస్ పోర్ట్, మెుబైల్ ఫోన్ ను ఎయిర్ పోర్ట్ లో పొగొట్టుకున్నాడు. దాంతో చివరి క్షణంలో ఈ ఊహించని పరిణామానికి అతడు షాక్ అయ్యాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఇంతకీ పాస్ పోర్ట్ దొరికిందా? లేదా? చూద్దాం పదండి.

టీమిండియా స్టార్ క్రికెటర్ రియాన్ పరాగ్ తన పాప్ పోర్ట్, సెల్ ఫోన్ ను ఎయిర్ పోర్ట్ లో పోగొట్టుకున్నాడు. జింబాబ్వే టూర్ కోసం బయలుదేరిన అతడికి చివరి క్షణంలో ఊహించని షాక్ తగిలింది. అయితే జింబాబ్వే టూర్ కు బయలుదేరే కొద్ది క్షణాల ముందే అతడికి పాస్ పోర్ట్ దొరికింది. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు. పాస్ పోర్ట్ దొరక్కపోతే.. అతడు ఇబ్బంది పడేవాడే. టీమ్ లో చోటు దక్కించుకున్న ఆనందంలో అతడు పాస్ పోర్ట్ పోగొట్టుకున్నాడని ఫ్యాన్స్ ఆటపట్టిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన రియాన్ పరాగ్ పరుగుల వరదపారించాడు. మిడిలార్డర్ బ్యాటర్ గా వచ్చిన అతడు 16 మ్యాచ్ ల్లో 573 పరుగులు చేశాడు. ఈ ఫర్ఫామెన్స్ తో ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో చోటుదక్కించుకుంటాడని అందరూ భావించారు. కానీ అతడికి అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు జింబాబ్వే టూర్ తో అవకాశం వచ్చింది. రియాన్ పరాగ్ ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తాడో? లేదో? చూడాలి మరి.

Show comments