Sanju Samson: సంజూ పనైపోయింది.. ఆ కుర్రాడు టీమ్​లో సెట్ అవడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​తో భారత్​కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్​ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్​మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​తో భారత్​కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్​ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్​మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​తో భారత్​కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్​ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్​మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది. బ్యాటింగ్​లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా రాణిస్తుండటంతో సంతోషంగా ఉంది. బ్యాటింగ్​లో టచ్​లోకి వచ్చిన పాండ్యా బౌలింగ్​లోనూ దుమ్మురేపుతున్నాడు. అతడితో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్​ కూడా బౌలింగ్​లో అదరగొడుతున్నారు. పేసర్లలో అర్ష్​దీప్ సింగ్ అవసరమైన టైమ్​లో బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. ఇలా చాలా మంది ప్లేయర్లు అంచనాలకు తగ్గట్లు పెర్ఫార్మ్ చేస్తుండటంతో భారత్​కు తిరుగుండటం లేదు. అయితే ఒక ప్లేయర్ మాత్రం నిరాశపరిచాడు.

బ్యాటర్ సంజూ శాంసన్​కు టీమ్​లో సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శల మధ్య రెండో టీ20లో ఛాన్స్ ఇచ్చింది మేనేజ్​మెంట్. వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్ ప్లేస్​లో అతడ్ని ఆడించింది. కానీ ఆడిన తొలి బంతికే క్లీన్​బౌల్డ్ అయ్యాడు శాంసన్. లేక లేక వచ్చిన అవకాశం నేలపాలు కావడంతో అతడికి మళ్లీ టీమ్​లో ప్లేస్ కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జట్టులో అన్ని పొజిషన్స్​కు యాప్ట్ ప్లేయర్లు ఉండటం, అందరూ ఫామ్​లో ఉండటంతో సంజూకు ఇక చోటు కష్టమని అంటున్నారు. టీమిండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శాంసన్ పనైపోయిందని అన్నాడు. అతడి కంటే కొత్త కుర్రాడు రియాన్ పరాగ్​కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని తెలిపాడు.

సంజూ స్థానంలో పరాగ్ టీమ్​లో సెటిల్ అవడం ఖాయమన్నాడు పఠాన్. బ్యాట్​తో పరుగులు చేయడంతో పాటు బంతితో బ్రేక్ త్రూలు అందించగల సత్తా అతడికి ఉందన్నాడు. ‘బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది గనుక పరాగ్​కు ఇకపై మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. టాపార్డర్​లో బ్యాటింగ్ చేస్తూ అతడిలా బాగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లు మన దేశంలో చాలా అరుదు. ఇది పరాగ్​కు అదనపు బలం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ రాణిస్తే ఫ్యూచర్​లో టీమిండియాకు అతడు ఎక్స్​ ఫ్యాక్టర్ ప్లేయర్​గా ఎదిగొచ్చు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. లంక సిరీస్​లో బ్యాటింగ్​లో పెద్దగా రాణించకపోయినా.. బౌలింగ్​లో ఆకట్టుకున్నాడు పరాగ్. ఆఫ్ స్పిన్ డెలివరీస్​తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టీ20లో 7 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. రెగ్యులర్ స్పిన్నర్ల కంటే అతడు వేసే బంతులు ఎక్కువగా స్పిన్ అవుతుండటం గమనార్హం. మరి.. సంజూ స్థానంలో పరాగ్ టీమ్​లో సెట్ అవుతాడనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments