వీడియో: వన్డేల్లోకి రియాన్‌ పరాగ్‌ ఎంట్రీ! రోహిత్‌ ముందు ఎమోషనల్‌ స్పీచ్‌

Riyan Parag, Virat Kohli: టీమిండియా తరఫున క్రికెట్‌ ఆడాలని ఎంతో మంది కలలుకంటూ ఉంటారు. కానీ, కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు. అలా నిజం చేసుకున్న రియాన్‌ పరాగ్‌.. తొలి వన్డే ఆడే ముందు ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Riyan Parag, Virat Kohli: టీమిండియా తరఫున క్రికెట్‌ ఆడాలని ఎంతో మంది కలలుకంటూ ఉంటారు. కానీ, కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకుంటారు. అలా నిజం చేసుకున్న రియాన్‌ పరాగ్‌.. తొలి వన్డే ఆడే ముందు ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో వన్డేతో.. రియాన్‌ వన్డేల్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన పరాగ్‌.. ఇప్పుడు వన్డేల్లోకి వచ్చేశాడు. అయితే.. శ్రీలంకతో మూడో వన్డేలో ఆడుబోతున్న విషయం పరాగ్‌కు ఒక రోజు ముందుగానే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ఆ సమయంలో పరాగ్‌ టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చాడు.

‘రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల ఆట చూస్తూ పెరిగాను.. కానీ, ఇప్పుడు వాళ్లతో పాటు ఒకే హోటల్‌లో, ఒక డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.’ అంటూ పేర్కొన్నాడు. దేశవాళి క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా మంచి ప్రదర్శన కనబర్చడంతో రియాన్ పరాగ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది. జింబాబ్వేతో సిరీస్‌లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన తల్లిదండ్రుల నుంచి క్యాప్‌ను అందుకున్న పరాగ్‌.. వన్డే క్యాప్‌ను తన ఆరాధ్య క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా అందుకున్నాడు.

క్యాప్‌ అందజేస్తున్న సమయంలో విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. ‘ముందుగా ఇండియా తరఫున తొలి వన్డే మ్యాచ్‌ ఆడబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు. నీలో ఏదో స్పెషల్‌ ఉందని నమ్మి.. సెలెక్టర్లు, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, రోహిత్‌ కలిసి నీకు ఈ అవకాశం కల్పించారు. మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచే సత్తా నీలో ఉంది. నీకు కూడా ఆ నమ్మకం ఉందని నాకు తెలుసు. చాలా కాలం నువ్వ నాకు తెలుసు. అలాగే మా అందరికీ నీపై అదే నమ్మకం ఉంది. ఇక టీమిండియా తరఫున అరంగేట్రం చేసేందుకు ఇంతకంటే బెటర్‌ టైమ్‌ ఉండదు. ఎందుకంటే.. మన ఇప్పుడు 0-1తో వెనకబడి ఉన్నాడు. ఫీల్డ్‌లో ప్రభావవంతమైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి అవకాశం. విష్‌ యూ ఆల్‌ ద బెస్ట్‌ క్యాప్‌ 256 రియాన్‌ పరాగ్‌’ అంటూ కోహ్లీ స్ఫూర్తి నించే స్పీచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఇతర ఆటగాళ్లు పరాగ్‌ను అభినందించారు. మరి వన్డేల్లోకి అడుగుపెట్టే ముందు రియాన్‌ పరాగ్‌ స్పీన్‌, కోహ్లీ ఇచ్చిన స్పీచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments