తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాడు రియాన్ పరాగ్. అస్సాం జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పరాగ్.. కేరళతో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాడు రియాన్ పరాగ్. అస్సాం జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పరాగ్.. కేరళతో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
కొందరు క్రికెటర్లు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు మంచితనంతో గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఇంకొందరు మాత్రం తన ఓవరాక్షన్ తో ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటారు. అలా ఆటకంటే ఓవరాక్షన్ తో ఓ వెలుగు వెలిగిన ఆటగాడు ఎవరంటే? రియాన్ పరాగ్ అనే చెబుతారు చాలా మంది. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు పరాగ్ ఈ టైమ్ లో తన అతిని చూపించాడు. అయితే గత కొంతకాలంగా తన ఓవరాక్షన్ ను పక్కన పెట్టి.. ఆటపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నాడు. దానికి కారణం అతడు సాధిస్తున్న రికార్డులే. తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. అస్సాం జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పరాగ్.. కేరళతో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
రియాన్ పరాగా.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చిచ్చర పిడుగు. కానీ తన అతి ద్వారా ఓవరాక్షన్ స్టార్ గా క్రికెట్ లో ముద్ర వేయించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మాత్రం తన అతిని పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టాడు. ఇక అప్పటి నుంచి అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ.. వస్తున్నాడు. తాజాగా దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు పరాగ్. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం(అక్టోబర్ 27) కేరళతో జరిగిన మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే ఓ ఫోర్, 6 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేసి.. తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. వరుసగా ఆరు అర్దశతకాలు సాధించి.. టీ20 క్రికెట్ లో ఎవరూ సాధించని ఘనతను లిఖించాడు. ఈ ప్రదర్శనకు ముందు వరుసగా.. 102*, 95, 45, 61, 76*, 53* 76, 72 రన్స్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ.. వికెట్లు పడగొడుతున్నాడు. ఇక ఇతడి ఆటతీరుతో 2024 ఐపీఎల్ వేలంలో పరాగ్ భారీ ధర పలికే అవకాశాలు లేకపోలేదు. మరి ఓవరాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగి వరల్డ్ రికార్డు సాధించిన రియాన్ పరాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.