SNP
MS Dhoni, Riyan Parag: టీమిండియా సూపర్ స్టార్ క్రికెటర్లతో ఒక ఫొటో దిగితే చాలాని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా ఫొటో దిగిన స్టార్ క్రికెటర్‌తోనే కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అలాంటి స్టోరీనే ఈ పిక్ టాక్ వెనుక ఉంది. మీరూ తెలుసుకోండి.
MS Dhoni, Riyan Parag: టీమిండియా సూపర్ స్టార్ క్రికెటర్లతో ఒక ఫొటో దిగితే చాలాని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా ఫొటో దిగిన స్టార్ క్రికెటర్‌తోనే కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అలాంటి స్టోరీనే ఈ పిక్ టాక్ వెనుక ఉంది. మీరూ తెలుసుకోండి.
SNP
ఐపీఎల్ కారణంగా చాలా మంది యువ క్రికెటర్లకు కెరీర్ ఆరంభంలోనే భారీ స్టార్‌డమ్ వచ్చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టక ముందే, జాతీయ జట్టుకి ఎంపిక కాకముందే.. వారికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ రెడీ అవుతోంది. అలాంటి స్టార్‌డమ్‌ను, క్రేజ్‌ను చాలా మంది యువ క్రికెటర్లు సంపాదించుకున్నారు. ఐపీఎల్ లాంటి మెగా క్యాష్ రిచ్ లీగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడటం. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ల మెంటరింగ్‌లో శిక్షణ పొందుతుండటంతో కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎంతో అనుభవం సంపాదించి, మెరికల్లా తయారు అవుతున్నారు. అలా ఐపీఎల్‌లో తనకంటే ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న కుర్రాడు.. ఒకప్పుడు టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఆ ఫొటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్‌లో సూపర్ స్టార్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరి ఆలోచిస్తున్నారా? లేదా ఇప్పటికే ఎవరో కనిపెట్టేశారా? క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకి ఇది పెద్ద విషయం కాదులేండి. ఫొటో చూడగానే ఇట్టే గుర్తుపట్టేసి ఉంటారు. ఎస్.. మీరు అనుకుంటున్నట్లు అతను రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యువ క్రికెటర్‌గా ఎప్పుటినుంచో ఆడుతున్న పరాగ్ ఈ మధ్య కాలంలో పరిణతి చెందిన ప్లేయర్‌లా దుమ్మురేపుతున్నాడు. గతంలో పిల్ల చేష్టలతో ఓవర్‌యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పరాగ్.. ఇప్పుడు ఆటతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం ఏకంగా విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్నాడు.
రియాన్ పరాగ్ గురించి పూర్తి వివరాల విషయానికి వస్తే.. రియాన్ పూర్తి పేరు రియాన్ పరాగ్ దాస్. 2001 నవంబర్ 10న అస్సాంలో జన్మించాడు. క్రికెట్‌పై ఇష్టంతో చిన్నతనం నుంచే క్రికెట్ నేర్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో పరాగ్ సభ్యుడిగా ఉన్నాడు. రియాన్ తండ్రి పరాగ్ దాస్ అస్సాం రైల్వేస్, ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. చాలా సంవత్సరాల క్రితం రియాన్ తండ్రి పరాగ్ దాస్, ఎంఎస్ ధోనితో కలిసి ఖరగ్‌పూర్, గౌహతిలో రైల్వేస్ టోర్నమెంట్‌లలో ఆడారు. ఆ సమయంలోనే ధోనితో పరాగ్ ఈ ఫొటో దిగి ఉంటాడు. మరి క్రికెట్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న రియాన్ పరాగ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
can u guess who is that little boy with ms dhoni. he is super star in ipl pic.twitter.com/yKLdNfHtR6
— Sayyad Nag Pasha (@nag_pasha) April 18, 2024